నాంపల్లి క్రిమినల్ కోర్టుకు హాజరైన కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి Deepadas Munshi

తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దీపాదాస్ మున్షి నాంపల్లి క్రిమినల్ కోర్టుకు హాజరయ్యారు.

Update: 2024-11-05 05:25 GMT

దిశ, వెబ్‌డెస్క్:  తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దీపాదాస్ మున్షి నాంపల్లి క్రిమినల్ కోర్టుకు హాజరయ్యారు. దీపాదాస్‌పై గతంలో బీజేపీ నేత ప్రభాకర్ చేసిన ఆరోపణల నేపథ్యంలో ఆయనపై ఇటీవల దీపాదాస్ మున్షి పరువు నష్టం దావా వేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే సదరు కేసుపై విచారణ జరగనుండగా దీపాదాస్ మున్షి కోర్టుకు హాజరయ్యారు. ఆమెతో పాటు బీజేపీ నేత ప్రభాకర్ కూడా హాజరయ్యారు. 

ఇదిలా ఉంటే రాజకీయ నేతలకు అండగా నిలిచేందుకు వారి నుంచి దీపాదాస్ మున్షి బహుమతులను స్వీకరించానని, ఓ రాజకీయ నేత నుంచి మెర్సిడెస్‌ కారును బహుమతిగా పొందానని ప్రభాకర్‌ ఓ టీవీ చానల్‌ మీటింగ్‌లో ఆరోపణలు చేశారు. ఈ వ్యాఖ్యలపై మండిపడిన దీపాదాస్ మున్షి.. ప్రభాకర్ తన పరువు ప్రతిష్టలకు భంగం కలిగించారంటూ కోర్టులో డిఫమేషన్ కేస్ ఫైల్ చేశారు. మాజీ ఎంపీ మధుయాష్కీగౌడ్‌తోపాటు కాంగ్రెస్‌ కార్యకర్తలు పార్థాభౌమిక్‌, శుభలక్ష్మిని ఆ పిటిషన్‌లో సాక్షులుగా చేర్చారు.


Similar News