నవంబర్, డిసెంబర్ నెలల్లో భారీగా పెళ్లి ముహూర్తాలు

తెలుగు రాష్ట్రాలతో పాటు భారత దేశం మొత్తం మరోసారి పెళ్లిళ్ల సీజన్(Wedding season) ప్రారంభం అయింది.

Update: 2024-11-05 05:36 GMT

దిశ, వెబ్‌డెస్క్: తెలుగు రాష్ట్రాలతో పాటు భారత దేశం మొత్తం మరోసారి పెళ్లిళ్ల సీజన్(Wedding season) ప్రారంభం అయింది. గతంలో మూడు నెలల పాటు అధిక మూడాలు రావడంతో ఆగిన పెళ్లిల్లు.. మధ్యలో అడపాదడపా ఉన్న ముహుర్తాల కారణంగా మరింత మందిని వేచి ఉండేలా చేసింది. ఈ క్రమంలో నవంబర్, డిసెంబర్ రెండు నెలల్లో భారీగా పెళ్లి ముహూర్తాలు ఉన్నాయని పురోహితులు తెలిపారు. తాజా అప్‌డేట్ ప్రకారం.. నవంబర్ నెలలో.. వరుసగా 7, 8, 9, 10, 13, 14, 17, 18, 20, 21, 23, 25, 27 తేదీల్లో శుభ ముహూర్తాలు ఉండగా.. డిసెంబర్ నెలలో 4, 5, 6, 7, 8, 9, 11, 20, 23, 25, 26 తేదీల్లో శుభకార్యాలకు దివ్యమైన ముహుర్తాలు ఉన్నట్లు పురోహితులు స్పష్టం చేశారు. మొత్తం రెండు నెలల్లో కలిపి 24 మంచి ముహూర్తాలు ఉన్నాయి. దీంతో ఇప్పటికే నవంబర్ నెలలో అన్ని డేట్లలో ఫంక్షన్ హాల్స్ పూర్తి బుక్ అయ్యయని.. ఈ రెండు నెలల్లో దాదాపు దేశ వ్యాప్తంగా అరకోటి జంటల పెళ్లిళ్లు అవుతాయని.. దీని కారణంగా.. రూ. 6 లక్షల కోట్ల బిజినెస్ జరుగుతుందని అంచనా వేస్తున్నారు.


Similar News