నగరంలో మరో దారుణం.. బట్టలు ఉతకాలని తీసుకెళ్లి మహిళపై గ్యాంగ్ రేప్
ఇటీవల కాలంలో తెలంగాణ రాష్ట్రంలో మహిళలపై లైంగిక దాడుల కేసులు పెరిగిపోతున్నాయి.
దిశ, వెబ్‌డెస్క్: ఇటీవల కాలంలో తెలంగాణ రాష్ట్రంలో మహిళలపై లైంగిక దాడుల కేసులు పెరిగిపోతున్నాయి. ఇలాంటి ఘటనలపై ప్రభుత్వం, పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నప్పటికీ నిత్యం ఎక్కడో ఒకచోట ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే మరో ఘటన సంచలనంగా మారింది. మధుర నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ మహిళపై ముగ్గురు వ్యక్తులు గ్యాంగ్ రేప్ చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితో.. రోజువారిగి ఇళ్లలో పనిమనిషిగా చేసే ఓ మహిళ.. సోమవారం రాత్రి.. కొండాపూర్ లో పనికి వెళ్ళింది. అక్కడ పని ముగిసిన తర్వాత రాత్రి సమయంలో తిరిగి ఇంటికి వెళ్తున్న సమయంలో ఆటోలో వచ్చిన ముగ్గురు యువకులు తమ రూమ్ లో బట్టలు ఉతకాలి అని చెప్పి తీసుకెళ్లారు.
అనంతరం ఆ మహిళను వారి రూమ్ లో బంధించారు. అనంతరం ఆమె నోట్లో బట్టలు కుక్కి, తీవ్రంగా గాయపరచడమే కాకుండా... ఆమెపై అత్యాచారం చేశారు. అనంతరం వారు బయటకు వెళ్ళగా అక్కడ నుంచి తప్పించుకున్న బాధితురాలు.. ఒంటిపై బట్టలు లేకుండా బయటకు పరుగులు తీసింది. ఇది గమనించిన స్థానిక మహిళ.. ఆమె నైటీ ఇచ్చింది. అనంతరం బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. దీంతో వెంటనే కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. కాగా ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.