Army jawan : ఏనుగుల దాడిలో భ‌ద్రాచలం ఆర్మీ జ‌వాన్ మృతి

అస్సాం(Assam) లో విధుల్లో ఉన్న భ‌ద్రాచలానికి చెందిన‌ ఆర్మీ జ‌వాన్(army jawan) ఏనుగుల దాడి(elephant attack)లో మృతి చెందారు.

Update: 2024-11-05 08:09 GMT
Army jawan : ఏనుగుల దాడిలో భ‌ద్రాచలం ఆర్మీ జ‌వాన్ మృతి
  • whatsapp icon

దిశ, వెబ్ డెస్క్ : అస్సాం(Assam) లో విధుల్లో ఉన్న భ‌ద్రాచలానికి చెందిన‌ ఆర్మీ జ‌వాన్(army jawan) ఏనుగుల దాడి(elephant attack)లో మృతి చెందారు. అసోంలోని అమ్రిబారిలో ఆర్మీ సిబ్బందిపై ఏనుగులు దాడి చేశాయి. ఏనుగుల దాడి నుంచి త‌ప్పించుకునే క్రమంలో కింద‌ప‌డిన జవాన్ కొంగా సాయిచంద్రారావు(Konga Saichandra Rao)పై ఏనుగులు దాడి చేశాయి. ఈ ఘటనలో సాయి చంద్రరావు అక్కడికక్కడే మరణించాడు. కొంగా సాయిచంద్రారావు స్వస్థలం భద్రాచ‌లం అశోక్‌న‌గ‌ర్‌. అతను కొంత‌కాలంగా అసోంలోని సోనిత్‌పూర్ జిల్లా రంగాపారాలో ఆర్మీ సుబేదార్‌గా విధులు నిర్వహిస్తున్నాడు.

జవాన్ సాయిచంద్రరావు మృతదేహాన్ని ఆర్మీ అధికారులు భ‌ద్రాచ‌లానికి తీసుకువ‌చ్చి కుటుంబ స‌భ్యుల‌కు అప్పగించారు. సాయిచంద్రరావు మృతదేహాన్ని చూసిన కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు.

Tags:    

Similar News