Firing: మరోసారి ఉలిక్కిపడిన భాగ్యనగరం.. గుడిమల్కాపూర్‌లో కాల్పుల కలకలం
మరోసారి భాగ్యనగరం (Bhagyanagaram) ఉలిక్కిపడింది.

దిశ, వెబ్‌డెస్క్: మరోసారి భాగ్యనగరం (Bhagyanagaram) ఉలిక్కిపడింది. ఓ వ్యక్తి ఉన్నట్టుండి కాల్పులు జరిపిన ఘటన గుడి మల్కాపూర్‌లో ఇవాళ మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గుడి మల్కాపూర్ (Temple Malkapur)లోని ఓ ఎక్స్‌పో (Expo)లో కాల్పుల మోత మోగింది. అకస్మాత్తుగా ఓ షాపు యజమాని తన వద్ద ఉన్న తుపాకీ (Gun)తో గాల్లోకి కాల్పులు జరిపాడు. ఈ హఠాత్పరిణామంతో ఎక్స్‌పో (Expo)కు హాజరైన వారంతా అక్కడి నుంచి భయంతో వణుకుతూ బయటకు పరుగులు తీశారు. షాపు యజమాని కాల్పులు ఎందుకు జరిపాడు.. అసలు ఏం జరిగిందనే విషయాలపై పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆరా తీస్తున్నారు. ఈ కాల్పులకు సంబంధించి పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది.