Disha Effect : స్పందించిన అధికారులు..
ప్రమాదాలకు నిలయంగా మారిన తల్లాడ మండల రహదారులు అనే దిశ వార్తాపత్రికలో వచ్చిన వార్తకు స్పందించి మండల అధికారులు, ప్రజాప్రతినిధులు సూచిక బోర్డులు ఏర్పాటు చేశారు.
దిశ, తల్లాడ : ప్రమాదాలకు నిలయంగా మారిన తల్లాడ మండల రహదారులు అనే దిశ వార్తాపత్రికలో వచ్చిన వార్తకు స్పందించి మండల అధికారులు, ప్రజాప్రతినిధులు సూచిక బోర్డులు ఏర్పాటు చేశారు. ఈ విషయం పై మండల ప్రజలు కొంతమేరకు సంతోషం వ్యక్తం చేస్తున్నా అవి తాత్కాలిక బోర్డులు మాత్రమే కావడంతో కాస్త విచారం వ్యక్తం చేస్తున్నారు. ముగ్గురు మంత్రులు ఉన్న ఖమ్మం జిల్లా.. అందులో ఇద్దరు మంత్రులు నిరంతరం తల్లాడ మండల రహదారులు వైపే ప్రయాణం సాగిస్తుంటారన్నారు.
ప్రధాన రహదారులను కలిపి తల్లాడ మండల రహదారులు ఉండటంతో నిత్యం ప్రజలు ప్రధాన మార్గం ద్వారా ప్రయాణిస్తూ ఉండటంతో ప్రాణాలను గుప్పెట్లో పెట్టుకోవాల్సివస్తుందన్నారు. తాత్కాలిక సూచిక బోర్డులు, డివైడర్లు ఏర్పాటు చేయడంతో ప్రజలు అధికారుల పై మండిపడుతున్నారు. అధికారులు వెంటనే స్పందించి శాశ్వత పరిష్కారం చేయాలని ప్రజల అభిప్రాయం. ఈ వార్త దిశ దినపత్రికలో వచ్చిన వెంటనే అధికారులు స్పందించి సూచిక బోర్డులు ఏర్పాటు చేయడంతో దిశ దినపత్రికి ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు.