దిశ ఎఫెక్ట్... అక్రమ కట్టడంపై అధికారులు కొరడా

కోల్ బెల్ట్ రామకృష్ణాపూర్ ఏ జోన్ ఏరియాలోని క్వార్టర్ లో ఓ కార్మికేతరుడు సింగరేణి సంస్థ అనుమతులు లేకుండా చేపట్టిన నిర్మాణంపై అధికారులు చర్యలు తీసుకున్నారు.

Update: 2024-11-28 16:25 GMT

దిశ,రామకృష్ణాపూర్ : కోల్ బెల్ట్ రామకృష్ణాపూర్ ఏ జోన్ ఏరియాలోని క్వార్టర్ లో ఓ కార్మికేతరుడు సింగరేణి సంస్థ అనుమతులు లేకుండా చేపట్టిన నిర్మాణంపై అధికారులు చర్యలు తీసుకున్నారు. ఈ నెల 28న దిశ దినపత్రికలో ఆగని అక్రమ నిర్మాణాలు అని ప్రచురితమైన కథనానికి మందమర్రి సింగరేణి ఉన్నతాధికారులు స్పందించారు.

    ఎస్ అండ్ పీసీ ఏఎస్ఓ నగునూరి రవి, సీనియర్ ఇన్స్పెక్టర్ రమేష్ ఆదేశాల మేరకు ఎస్ అండ్ పీసీ సిబ్బంది గురువారం రామకృష్ణాపూర్ ఏ జోన్ ఏరియా సింగరేణి క్వార్టర్ లో జరుగుతున్న అక్రమ కట్టడాలను కూల్చివేశారు. సింగరేణి స్థలాల్లో అక్రమ కట్టడాలు జరిపినా, సింగరేణి క్వార్టర్లను కబ్జా చేసినా చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎస్అండ్పీసీ జూనియర్ ఇన్స్పెక్టర్ బట్టారి చంద్రమౌళి, జమ్మిదార్ గుండ రాజయ్య, ఎస్ అండ్ పిసి ఎస్టేట్ సిబ్బంది శాంతకుమార్ పాల్గొన్నారు. 


Similar News