రేపు ఘనంగా దీక్ష దివస్

తెలంగాణ మలి దశ ఉద్యమాన్ని మలుపు తిప్పిన కేసీఆర్​ నవంబర్ 29, 2009న చేపట్టిన నిరాహార దీక్షను మరోసారి గుర్తు చేసుకుంటూ శుక్రవారం జిల్లాలో దీక్ష దివస్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు రాజ్యసభ సభ్యుడు రవిచంద్ర, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ తెలిపారు‌.

Update: 2024-11-28 14:30 GMT

దిశ, ఖమ్మం : తెలంగాణ మలి దశ ఉద్యమాన్ని మలుపు తిప్పిన కేసీఆర్​ నవంబర్ 29, 2009న చేపట్టిన నిరాహార దీక్షను మరోసారి గుర్తు చేసుకుంటూ శుక్రవారం జిల్లాలో దీక్ష దివస్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు రాజ్యసభ సభ్యుడు రవిచంద్ర, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ తెలిపారు‌. గురువారం ఖమ్మంలోని తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ స్వరాష్ట్ర కల సాకారానికి పునాది వేసిన రోజుగా తెలంగాణ చరిత్రలో నిలిచిపోయే శుభదినం నవంబర్ 29 అన్నారు. ఈ సందర్భంగా దీక్ష దివాస్ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో భాగంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలిరావాలని కోరారు. కేసీఆర్ తెలంగాణ సమాజాన్ని ఐక్యం చేసిన సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ ఉద్యమ స్ఫూర్తిని ప్రజల్లో మళ్లీ రగిలించే విధంగా రేపు ఖమ్మం జిల్లా కేంద్రంలో వివిధ కార్యక్రమాలు చేపడతామని తెలియజేశారు.

    దీక్షా దివస్ కార్యక్రమంలో భాగంగా ఖమ్మం జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ సర్కిల్ లో గల తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం, పెవిలియన్ గ్రౌండ్ ‌లో గల తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద ఘన నివాళులు, జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలో రోగులకు పండ్లు పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ ఉద్యమానికి సంబంధించిన ఫొటో ఎగ్జిబిషన్ ను ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. అనంతరం జిల్లా పార్టీ కార్యాలయంలో దీక్షా దివస్ చారిత్రక సంఘటనలు తెలంగాణ ఉద్యమకారులు, పార్టీ ముఖ్య నాయకులు క్యాడర్ కి వివరిస్తారని తెలిపారు.

     దీక్ష దివాస్ ఇన్చార్జిలుగా ఖమ్మం నియోజకవర్గం ఎమ్మెల్సీ తక్కలపల్లి రవీందర్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకి రాజ్యసభ సభ్యుడు రవిచంద్రలు ఉంటారని తెలిపారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే బానోతు చంద్రమతి, బీ రెడ్డి నాగచంద్ర రెడ్డి, మాజీ గ్రంథాలయ చైర్మన్ ఖామర్,‌ రూలర్ పార్టీ అధ్యక్షుడు బెల్లం వేణు, శీలంశెట్టి వీరభద్రం, తోట వీరభద్రం, తెలంగాణ ఉద్యమకారులు ఉప్పల వెంకటరమణ, బొమ్మెర రామ్మూర్తి, డోకుపర్తి సుబ్బారావు,‌ పగడాల నరేందర్, లింగన్న బోయిన సతీష్, గొట్టేముక్కుల శీను, ఆసిఫ్, ఇతర పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.


Similar News