భర్తకు సెక్స్ డాల్ గిఫ్ట్‌గా ఇచ్చిన భార్య.. దాని కోసమేనంటూ..
దిశ, ఫీచర్స్ : ఇంగ్లాండ్‌లోని వార్విక్‌షైర్‌కు చెందిన చార్ గ్రే అనే మహిళ తన భర్త కల్లమ్ లైంగిక అవసరాలను తీర్చేందుకు సెక్స్ డాల్ గిఫ్ట్‌గా ఇచ్చింది.
దిశ, ఫీచర్స్ : ఇంగ్లాండ్‌లోని వార్విక్‌షైర్‌కు చెందిన చార్ గ్రే అనే మహిళ తన భర్త కల్లమ్ లైంగిక అవసరాలను తీర్చేందుకు సెక్స్ డాల్ గిఫ్ట్‌గా ఇచ్చింది. దాదాపు రూ. 1.43లక్షల విలువైన సెక్స్ డాల్ ఇచ్చిన ఆమె.. దీనికి డీ అని పేరు పెట్టింది కూడా.
తన భర్తకు సెక్స్ డ్రైవ్ అధికంగా ఉండటం చాలా గొప్పవిషయమని.. కానీ ఆమె మూడ్‌లో లేనప్పుడు డిజప్పాయింట్ కాకుండా, డాల్‌తో సంతోషం పొందేందుకు మంచి మార్గమని అభిప్రాయపడింది. డీతో ప్రయోగాలు చేసేందుకు కూడా ఇష్టపడతామన్న ఆమె.. కుటుంబ సభ్యుడిగా మారిపోయిందని తెలిపింది. తమ లైంగిక జీవితానికి సాయపడిన డీని లాంగ్ డ్రైవ్స్‌కు కూడా తీసుకెళ్తామని చెప్పింది. ఇక ఈ నిర్జీవమైన బొమ్మపై ఎలాంటి జలస్ లేదంటున్న చార్.. భర్త కల్లమ్‌కు సుఖాన్ని అందించడమే తన ఉద్దేశ్యమని చెప్పుకొంది. కాగా ఇందుకు సంబంధించిన పిక్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.