Tamilisai: అన్ని విషయాలు మీడియాతో చెప్పలేను.. అమిత్‌షాతో భేటీ అనంతరం తమిళి సై

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ గవర్నర్ తమిళి సై ఢిల్లీ పర్యటనలో భాగంగా బుధవారం ప్రధాని మోడీతో భేటీ కాగా, గురువారం కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సమావేశమై రాష్ట్రంలోని పరిస్థితులను వివరించారు.

Update: 2022-04-07 08:28 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ గవర్నర్ తమిళి సై ఢిల్లీ పర్యటనలో భాగంగా బుధవారం ప్రధాని మోడీతో భేటీ కాగా, గురువారం కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సమావేశమై రాష్ట్రంలోని పరిస్థితులను వివరించారు. ఈ సందర్భంగా సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. అమిత్ షాతో చర్చించిన విషయాలన్నీ బయటకు చెప్పలేనని, తెలంగాణ ప్రజల శ్రేయస్సు కోసమే ఎప్పుడూ ఆలోచిస్తానని కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో తను రైలు, రోడ్డు మార్గాల ద్వారా మాత్రమే ప్రయాణించగలనని, తెలంగాణలో గవర్నర్ ప్రయాణించగలిగే పరిస్థితి ఇదేనంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. మేడారానికి వెళ్లినప్పుడు కూడా ప్రొటోకాల్ పాటించలేదంటూ నేను చెప్పలేదని, ఈ విషయాన్ని సీతక్క చెప్పారని గుర్తుచేశారు. యాదాద్రిలో తనకు మర్యాద ఇవ్వలేదని ఎక్కడా అనలేదని, మీడియా అలా రాసిందన్నారు. అంతేగాకుండా, యాదాద్రి ఆలయానికి వెళ్తే.. బీజేపీ వ్యక్తిగా వెళ్లానంటూ వారు ఎలా చెబుతారంటూ మండిపడ్డారు. తాను బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నానని, ఈ రెండేళ్లలో బీజేపీ నాయకుల్ని కేవలం ఒకటి రెండుసార్లు మాత్రమే కలిశానని చెప్పుకొచ్చారు. ఉగాది ఉత్సవాలకు నేను పిలిస్తే ప్రభుత్వం నుంచి ఎవరూ రాలేదని, ఇదేనా మర్యాద అంటూ మండిపడ్డారు.

Tags:    

Similar News