శవంతో సెక్స్ క్రూరమే.. కానీ రేప్ కాదు.. : ఛత్తీస్‌గఢ్ హైకోర్టు సంచలన తీర్పు

శవంతో సెక్స్‌లో పాల్గొనడం క్రూరమైన చర్య అని కానీ అది రేప్ కిందికి రాదని ఛత్తీస్‌గఢ్ హైకోర్టు అభిప్రాయపడింది.

Update: 2024-12-23 11:02 GMT

దిశ, నేషనల్ బ్యూరో : శవంతో సెక్స్‌లో పాల్గొనడం క్రూరమైన చర్య అని కానీ అది రేప్ కిందికి రాదని ఛత్తీస్‌గఢ్ హైకోర్టు అభిప్రాయపడింది. రద్దయిన భారతీయ శిక్షాస్మృతి(ఐపీసీ)లోని సెక్షన్ 376 లేదా పోక్సో చట్టం ప్రకారం బాధితురాలు బతికి ఉన్నప్పుడే చట్టాలు వర్తిస్తాయని తేల్చిచెప్పింది. దోషిని అత్యాచార నేరం కింద శిక్షించడానికి అవకాశం లేదని తెలిపింది. నిందితుడు మృతదేహంపై అత్యాచారం చేయడం అత్యంత భయంకరమైన నేరాల్లో ఒకటని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదని జస్టిస్ రమేశ్ సిన్హా, జస్టిస్ బిభు దత్తా గురులతో కూడిన ధర్మాసనం అభిప్రాయపడింది. ఇద్దరు వ్యక్తులు మైనర్‌ను కిడ్నాప్ చేసి హత్యాచారానికి పాల్పడిన ఘటనకు సంబంధించిన పిటిషన్‌పై ఈ మేరకు తీర్పు వెల్లడించింది. నెక్రోఫిలియా(శవంతో సెక్స్) రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 గౌరవంగా చనిపోయే హక్కును ఉల్లంఘిస్తుందని పేర్కొంది.

Tags:    

Similar News