గ్రూప్ –1 ఉద్యోగాల భర్తీకి రంగం సిద్ధం.. నోటిఫికేషన్ వచ్చేది అప్పుడే!
గ్రూప్–1కు వడివడిగా అడుగులు పడుతున్నాయి. నాలుగు మినహా అన్నిశాఖలూ టీఎస్పీఎస్సీకి రిజర్వేషన్లు, రోస్టర్ పాయింట్ల జాబితాను సమర్పించాయి.
గ్రూప్–1కు వడివడిగా అడుగులు పడుతున్నాయి. నాలుగు మినహా అన్నిశాఖలూ టీఎస్పీఎస్సీకి రిజర్వేషన్లు, రోస్టర్ పాయింట్ల జాబితాను సమర్పించాయి. మొత్తం 503 పోస్టుల భర్తీకి వెయ్యి మార్కులతో రాత, మౌఖిక పరీక్ష నిర్వహించనున్నారు. ఇందులో 900 మార్కులు రాత పరీక్షకు, 100 మార్కులు ఇంటర్వ్యూకు ఉంటాయి. మెయిన్స్‌లో మొత్తం ఆరు ప్రశ్నాపత్రాలుంటాయి. ఇందులో ఆరో పేపర్ పూర్తిగా తెలంగాణ ఉద్యమ చరిత్రతో ముడిపడి ఉండటం విశేషం. సిలబస్ అప్ గ్రేడేషన్ ప్రక్రియను సైతం టీఎస్ పీఎస్సీ పూర్తి చేసింది. 166 కొలువులు 33% రిజర్వేషన్ల కింద మహిళలకు కేటాయిస్తారు. ఈ సారి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లకు సంబంధించిన క్లారిటీ సైతం ఇచ్చారు. జనరల్ కోటాలో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు 10% పోస్టులను కేటాయించనున్నారు. మరో నాలుగు శాఖల నుంచి రిజర్వేషన్లు, రోస్టర్ పాయింట్ల జాబితా రాగానే నోటిఫికేషన్ ఇచ్చేందుకు టీఎస్పీఎస్సీ సిద్ధంగా ఉంది.
దిశ, తెలంగాణ బ్యూరో: గ్రూప్ –1 ఉద్యోగాల భర్తీకి సిద్ధమవుతున్నారు. మొత్తం 503 గ్రూప్ –1 పోస్టులకు ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది. ఈ నేపథ్యంలో ఆయా శాఖల నుంచి ప్రతిపాదనలు పూర్తి చేశారు. గురువారం సాయంత్రం వరకు 4 శాఖలు మినహా.. మిగతావన్నీ రిజర్వేషన్లు, రోస్టర్పాయింట్లను ఖరారు చేసి జాబితాను టీఎస్ పీఎస్సీకి పంపాయి. రిజర్వేషన్ల ఆధారంగా ఏ పోస్టులు ఏయే వర్గాలకు కేటాయించారో దాదాపుగా క్లారిటీ వచ్చింది. మొత్తం పోస్టుల్లో ఎస్సీలకు 15% కేటాయించగా.. బీసీ (ఈ) మినహాయిస్తే బీసీలకు 25% కొలువులు రానున్నాయి. 50 శాతం రిజర్వేషన్ల కోసం మినహాయించి మిగితా పోస్టులు జనరల్ కోటాలో ఉంచారు. ఇందులో 10% ఈడబ్ల్యూఎస్‌కు, స్పోర్ట్స్, దివ్యాంగుల కు మొత్తం పోస్టుల మీద 6%, మహిళలకు 33% వర్తింపజేస్తారు. పలు శాఖల నుంచి జాబితా ఇవ్వగా.. వాటిలో పలు మార్పులు చూపించిన టీఎస్పీఎస్సీ.. ఎక్కడా సాంకేతికపరమైన ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకుంటున్నది. ఎక్కువ పోస్టులు ఉన్న యూనిఫాం సర్వీసుల నుంచే పెండింగ్‌లో ఉన్నాయని టీఎస్పీఎస్సీ వర్గాలు తెలిపాయి. పోలీస్, రెవెన్యూ, ఆర్టీవో వంటి విభాగాల నుంచి లిస్ట్ ఇవ్వగానే నోటిఫికేషన్ఇచ్చేందుకు సిద్ధమంటున్నారు.
వెయ్యి మార్కులతో సిలబస్ అప్డేట్
గ్రూప్ – 1 ఉద్యోగ నియామక పరీక్షకు 1000 మార్కులను యథాతథంగా ఖరారు చేశారు. ఇందులో ఇంటర్వ్యూ 100 మార్కులు. మిగిలినవన్నీ రాత పరీక్షల ద్వారానే. ఈసారి పోటీ ఎక్కువగా ఉండే కారణంగా కనీసం 460 నుంచి 500 మార్కులు కనిష్ఠంగా వస్తేనే ఇంటర్వ్యూకు పిలిచే అవకాశం ఉందని తెలుస్తున్నది. గతంలో ఇది 420 నుంచే మొదలైంది. కానీ ఈసారి కనీసం 450 మార్కులు దాటిన వారికే ఇంటర్వ్యూ కు చాన్స్ ఇవ్వనున్నారు.
సిలబస్ అప్‌గ్రేడ్
ప్రిలిమినరీ పరీక్ష (జనరల్ స్టడీస్, అబ్జెక్టివ్ టైపు) పేపర్‌కు 150 మార్కులుగా నిర్ధారించారు. ప్రిలిమినరీ పరీక్ష సమయం 2.30 గంటలు. మెయిన్ రాత పరీక్ష జనరల్ఇంగ్లీష్(క్వాలిఫై టెస్ట్ )కు 150 మార్కులు ఉండగా, సమయం 3 గంటలుగా ఖరారు చేశారు. పేపర్ –1లో జనరల్ వ్యాసరచన కింద టాపిక్‌లు వెల్లడించారు. సమకాలీన సామాజిక సమస్యలు, సామాజిక సమస్యలు, ఎకనామిక్గ్రోతింగ్అండ్ జస్టిస్, డైనమిక్స్ ఇండియన్ పాలిటిక్స్, హిస్టారికల్ అండ్ కల్చరల్ హెరిటేజ్ ఆఫ్ ఇండియా, సైన్స్, టెక్నాలజీ రంగంలో అభివృద్ధి, ఎడ్యుకేషన్ అండ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ అంశాలకు సంబంధించిన పేపర్ –1కు 150 మార్కులు ఉండగా, 3 గంటల సమయం కేటాయించారు. ఇక పేపర్ –2లో హిస్టరీ, కల్చర్ అండ్ జియాగ్రఫీలో హిస్టరీ అండ్, కల్చర్ ఆఫ్ ఇండియా, 1757 నుంచి 1947వ సంవత్సరం వరకు స్పెషల్ మోడ్రన్ పిరియడ్, హిస్టరీ అండ్ కల్చర్ హెరిటేజ్ ఆఫ్ తెలంగాణ, జియాగ్రఫీ ఆఫ్ ఇండియా అండ్ తెలంగాణకు సంబంధించిన టాపిక్స్ ఉండగా, మొత్తం 150 మార్కులు, 3 గంటల సమయం నిర్ధారించారు.
పేపర్ –3లో ఇండియన్ సొసైటీ, కానిస్టిట్యూషన్ అండ్ గవర్నెన్స్ కింద ఇండియన్ సొసైటీ, స్ట్రక్చర్, ఇష్యూస్ అండ్ సోషల్ మూవ్మెంట్స్, కానిస్ట్యూషన్ ఆఫ్ ఇండియా, గవర్నెన్స్ అంశాలపై పేపర్ –3లో 150 మార్కులు, 3 గంటల సమయం ఖరారు చేశారు. పేపర్ –4లో ఎకానమీ అండ్ డెవలప్మెంట్ కింద ఇండియన్ ఎకానమీ అండ్ డెవలప్మెంట్, తెలంగాణ ఎకానమీ, డెవలప్మెంట్ అండ్ ఎన్విరాన్మెంట్ ప్రాబ్లం అంశాలపై 150 మార్కులు, దీనికి 3 గంటల సమయంగా నిర్ధారించారు. పేపర్ –5లో సైన్సెస్, టెక్నాలజీ అండ్డేటా అంశాలపై రోల్అండ్ఇంపాక్ట్ఆఫ్సైన్సెస్అండ్టెక్నాలజీ, మోడ్రన్ ట్రెండ్స్ ఇన్ అప్లికేషన్ ఆఫ్ నాలెడ్జ్ ఆఫ్ సైన్సెస్, డేటా ఇంట్రప్షన్ అండ్ ప్రాబ్లం సాల్వ్‌కు సంబంధించిన టాపిక్స్‌పై 150 మార్కుల ప్రశ్నాపత్రం ఉండగా, సమయం 3 గంటల వ్యవధి నిర్ణయించారు. పేపర్ –6లో తెలంగాణ మూవ్మెంట్ అండ్ రాష్ట్రం ఏర్పాటు అంశాలను పొందుపర్చినట్లు సిలబస్‌లో పేర్కొన్నారు. ఐడియా ఆఫ్ తెలంగాణ (1948–1970), మొబిలైజేషన్ ఫేజ్ (1971–1990), ఫార్మేషన్ ఆఫ్ తెలంగాణ స్టేట్ (1991–2014)కు సంబంధించిన అంశాలు ఉంటాయని, 150 మార్కులు, 3 గంటల సమయం కేటాయించినట్లు టీఎస్పీఎస్సీ ప్రకటించింది. దీనికి సంబంధించిన అంశాలను అప్‌గ్రేడ్ చేసినట్లు ప్రకటించారు. ఈ రాత పరీక్షకు మొత్తం 900 మార్కులు ఉండగా.. ఇంటర్వ్యూకు 100 మార్కులు ఖరారు చేశారు.
రిజర్వేషన్లపై క్లారిటీ (శాతాల్లో)
సామాజిక వర్గం | రిజర్వేషన్ | పోస్టులు (అంచనా) |
బీసీ (ఏ) | 07 | 35 |
బీసీ (బీ) | 10 | 50 |
బీసీ (సీ) | 01 | 05 |
బీసీ (డీ) | 07 | 35 |
బీసీ(ఈ) | 04 | 21 |
ఎస్సీ | 15 | 75 |
ఎస్టీ | 06 | 30 |
జనరల్ నుంచి
ఈడబ్ల్యూఎస్ | 10 | 25 |
స్పోర్ట్స్ | 02 | 10 |
దివ్యాంగులు | 04 | 20 |
మొత్తం పోస్టుల్లో
మహిళలకు.. | 33 | 166 |
టోటల్ | -- | 503 |