యాదాద్రిలో ఘోర విషాదం.. ప్రైవేట్ లాడ్జీలో తండ్రీకూతురు ఆత్మహత్య
దిశ, యాదగిరిగుట్ట: యాదగిరిగుట్టలో తీవ్ర విషాద ఘటన చోటుచేసుకుంది. ప్రైవేట్ లాడ్జీలో తండ్రీకూతురు సూసైడ్ నోట్ రాసి మరీ ఆత్మహత్య చేసుకున్న ఘటన స్థానికంగా కలకలంగా మారింది.
దిశ, యాదగిరిగుట్ట: యాదగిరిగుట్టలో తీవ్ర విషాద ఘటన చోటుచేసుకుంది. ప్రైవేట్ లాడ్జీలో తండ్రీకూతురు సూసైడ్ నోట్ రాసి మరీ ఆత్మహత్య చేసుకున్న ఘటన స్థానికంగా కలకలంగా మారింది. వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్‌లోని లింగంపల్లికి చెందిన తండ్రీకూతురు సురేశ్(40), శ్రేష్ఠ(06) యాదగిరిగుట్ట లక్ష్మి నరసింహ స్వామి దర్శనానికి వచ్చారు. ఈ క్రమంలో గుట్టలోనే ఓ లాడ్జీలో రూమ్ అద్దెకు తీసుకున్నారు. గురువారం సుమారు అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. విషయం తెలిసిన పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని ఆత్మహత్మ స్థానికులు వివరాలు తెలిపిన ప్రకారం.. పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి, కుటుంబ కలహాలే హాత్మహత్యకు కారణమని సూసైడ్ నోట్‌లో రాసినట్లు పోలీసులు గుర్తించారు. 'నేను చనిపోతే నా కూతురును సరిగా చూసుకుంటారో లేదో అని, ఇద్దరం ఆత్మహత్య చేసుకున్నాము' అని నోట్‌లో పేర్కొన్నారు. అనంతరం కేసు నమోదు చేసుకున్న స్థానిక సీఐ జానకి రెడ్డి, మృతదేహాలను స్థానిక భువనగిరి ఏరియా ఆసుపత్రికి తరలించారు. అనంతరం దర్యాప్తు చేపట్టారు. ఆత్మహత్యకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.