ఇక ప్రైవేట్ ఆస్పత్రుల్లోనూ బూస్టర్ డోస్

కరోనా వైరస్ కట్టడికి ప్రభుత్వం అందిస్తున్న వ్యాక్సినేషన్ కొనసాగుతోంది. ఇప్పటికే దేశంలోని 86 శాతం మంది అర్హులకు రెండు డోసుల వ్యాక్సిన్ అందించినట్లు

Update: 2022-04-08 10:11 GMT

దిశ, డైనమిక్ బ్యూరో : కరోనా వైరస్ కట్టడికి ప్రభుత్వం అందిస్తున్న వ్యాక్సినేషన్ కొనసాగుతోంది. ఇప్పటికే దేశంలోని 86 శాతం మంది అర్హులకు రెండు డోసుల వ్యాక్సిన్ అందించినట్లు కేంద్రం వెల్లడించింది. అంతేగాకుండా, కరోనా థర్డ్ వేవ్ సమయంలో ఫ్రంట్ లైన్ వారియర్స్, వృద్ధులకు అందించిన బూస్టర్ డోస్‌ను ప్రైవేటు వ్యాక్సినేషన్ సెంటర్ల ద్వారా 18 సంవత్సరాలు పైబడిన వారికి అందించేందుకు సిద్ధమైంది. ఈ సందర్భంగా ఏప్రిల్ 10 ఆదివారం నుంచి ప్రైవేటు వ్యాక్సినేషన్ సెంటర్లలో ప్రికాషన్ డోసులు అందుబాటులో ఉంటాయని శుక్రవారం ప్రకటన విడుదల చేసింది. అయితే, రెండో డోసు తీసుకొని 9 నెలలు పూర్తయిన వారికి ప్రికాషన్ డోస్ తీసుకోవాలని సూచించింది.

Tags:    

Similar News