ఒలింపిక్ విజేతలకు భారీ నజరానా.. ప్రకటించిన బీసీసీఐ

ముంబై : టోక్యో ఒలింపిక్ పతక విజేతలకు భారత క్రికెట్ నియంత్రణ మండలి..latest telugu news

Update: 2022-03-26 17:34 GMT

ముంబై : టోక్యో ఒలింపిక్ పతక విజేతలకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ నజరానా ప్రకటించింది. శనివారం ఐపీఎల్ మ్యాచ్ ప్రారంభానికి ముందు వాంఖడే మైదానంలో దేశానికి ఒలింపిక్ పతకాలు తీసుకొచ్చిన అథ్లెట్లను బీసీసీఐ ఘనంగా సత్కరించింది. అనంతరం జావెలిన్ త్రో విభాగంలో బంగారు పతకం సాధించిన నీరజ్ చోప్రాకు రూ.1కోటి, బాక్సింగ్ విభాగంలో కాంస్య పతకం సాధించిన లవ్లీ నాకు రూ.25 లక్షలు, టోక్యో ఒలింపిక్ హాకీ విభాగంలో సెమీస్‌లో ఓటమి పాలైన భారత హాకీ జట్టుకు రూ.1.25 కోట్లు రివార్డును బీసీసీఐ ప్రకటించింది. బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ చేతుల మీదుగా అథ్లెట్లు చెక్కులు అందుకోగా, హాకీ జట్టు తరఫున కెప్టెన్ మన్‌ప్రీత్ సింగ్ అందుకున్నాడు.

Tags:    

Similar News