49 ఏళ్ల వయసులో లవ్ మ్యారేజ్ చేసుకున్న నటుడు.. లేటు వయసులో ఘాటు ప్రేమ అంటున్న నెటిజన్లు

లేటు వయసులో పెళ్లి చేసుకోవడం ఇప్పుడు ఒక ట్రెండ్ అయిపోయింది. ఇక సినీ ఇండస్ట్రీలో అయితే చెప్పనక్కర్లేదు.

Update: 2024-11-01 07:59 GMT

దిశ, సినిమా: లేటు వయసులో పెళ్లి చేసుకోవడం ఇప్పుడు ఒక ట్రెండ్ అయిపోయింది. ఇక సినీ ఇండస్ట్రీలో అయితే చెప్పనక్కర్లేదు. అయితే కొంత మంది సెలబ్రిటీలు చిన్న ఏజ్‌లోనే పెళ్లి చేసుకొని షాక్ ఇస్తుంటే.. మరికొంతమందేమో ఏజ్ బార్ అయిన తర్వాత మ్యారేజ్ చేసుకుంటున్నారు. అలా లేటు వయసులో పెళ్లి చేసుకుంటున్న వారిలో బుల్లితెర నటుడు వేణుగోపాల్(VENUGOPAL) కూడా ఒకరు. ఈయన వయసు ప్రస్తుతం 49 సంవత్సరాలు. అయితే ఈ నటుడు ఈ ఏజ్‌లో నటి దివ్య శ్రీధర్‌(DIVYA SRIDHAR)ను వివాహం చేసుకున్నారట. తాజాగా వీరి వివాహం కేరళ(KERALA)లోని గురువాయర్‌లో జరిగినట్లు కొన్ని ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అయితే వీరిద్దరూ కలిసి 'పాతరమట్టు'(PATHARAMATTU) అనే సీరియల్‌లో నటించారు. ఇక ఈ సమయంలోనే వేణుగోపాల్ దివ్యను చూసి ఇష్టపడ్డారట. దీంతో ఆమెను మ్యారేజ్ చేసుకోవాలని ఫిక్స్ అయ్యి ఈ విషయం తనకు చెప్పారట.

అయితే ఈ వివాహం గురించి నటి దివ్య మాట్లాడుతూ.. తనకు మొదట ప్రపోజ్ చేసింది వేణుగోపాల్ అని.. తనని ప్రేమిస్తున్నానని వివాహం చేసుకుంటానని చెప్పడంతో ఏం చేయాలో అర్థం కాలేదు. అయితే తనని ఎలాగైనా మ్యారేజ్ చేసుకోవాలని వేణుగోపాల్ పట్టుబడడంతో చివరికి తనను ఒప్పించి.. తన కొడుకుని కూడా ఒప్పించి మరీ వివాహం చేసుకున్నారని తెలిపారు. అలాగే తమకు తండ్రి దొరికాడని తమ కూతురు, కొడుకు సంతోషంగా ఉన్నారని తెలిపింది నటి దివ్య. కాగా దివ్య, వేణుగోపాల్ ఇద్దరూ ప్రేమ వివాహం చేసుకోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ప్రస్తుతం ఈ న్యూస్ నెట్టింట వైరల్‌గా మారగా.. లేటు వయసులో ఘాటు ప్రేమ అని, లవ్‌కు వయసుతో సంబంధం లేదని ఈ జంట మరోసారి నిరూపించారంటూ పలువురు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

Read More..

ఆ స్టార్ డైరెక్టర్‌తో పీకల్లోతు ప్రేమలో మునిగి తేలుతున్న లవ్ టుడే బ్యూటీ.. త్వరలో పెళ్లి కూడా.. (పోస్ట్)

Tags:    

Similar News