అభివృద్ధి, సంక్షేమంలో తెలంగాణ టాప్ : ఎమ్మెల్సీ కవిత

అభివృద్ధి, సంక్షేమంతో పాటు 25 సూచికల్లో తెలంగాణ నెంబర్ వన్ గా ఉండటం గర్వకారణమని ఎమ్మెల్సీ కవిత అన్నారు.

Update: 2022-03-15 16:06 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : అభివృద్ధి, సంక్షేమంతో పాటు 25 సూచికల్లో తెలంగాణ నెంబర్ వన్ గా ఉండటం గర్వకారణమని ఎమ్మెల్సీ కవిత అన్నారు. శాస‌న‌ మండలిలో మంగళవారం ద్రవ్య వినిమ‌య బిల్లుపై జరిగిన చ‌ర్చలో ఆమె మాట్లాడారు. సీఎం కేసీఆర్ దార్శనికత ప్రణాళికాబద్ధత వల్ల దేశంలోనే తెలంగాణ పవర్ హౌస్ గా నిలబడుతుందన్నారు. 2014లో లక్ష కోట్లుగా ఉన్న బడ్జెట్ 2022 సంవత్సరంలో 2 లక్షల 56 వేలకోట్లకు చేరిందని, ఇది అభివృద్ధికి సూచిక అని కొనియాడారు.

దేశ జీడీపీకి అత్యధికంగా తెలంగాణ రాష్ట్రమే బాసటగా నిలుస్తోందన్నారు. 29 వేల కోట్లు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెట్టిన ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నారు. రాష్ట్రం ఏర్పాటు అయిన కొత్త లో 2014లో ఇక్కడి సగటు తలసరి ఆదాయం 1,24,000 రూపాయలు కాగా, కేవలం ఎనిమిది ఏళ్లలో 2,78,000 రూపాయలకు తలసరి ఆదాయం పెరగడం రాష్ట్రాభివృద్ధికి సూచిక అన్నారు. గ్రామాలు అభివృద్ధి చెందుతేనే దేశం ప్రగతి చెందుతుందనే సిద్ధాంతంతో ముందుకు వెళ్తూ దేశంలోనే ఎక్కడా లేని విధంగా పల్లె ప్రగతి కోసం నిధులు కేటాయిస్తున్న రాష్ట్రం తెలంగాణ అని కొనియాడారు.

భౌగోళిక పరంగా 12వ స్థానంలో ఉన్న తెలంగాణ, అభివృద్ధిలో మాత్రం నెంబర్ వన్ లో ఉంది.. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా గ్రీన్ ఫండ్ ఏర్పాటు చేసి తెలంగాణ రాష్ట్రం రోల్ మోడల్ గా నిలిచిందన్నారు. ఐకేపీ మెప్మా , సెర్ప్ ఉద్యోగులకు వేతనాల పెంపు ప్రకటన చేసిన కేసీఆర్ కు ధన్యవాదాలు తెలిపారు.

Tags:    

Similar News