పేదవారికి అండగా ఉంటా.. అభివృద్ధి చేసి చూపిస్తా..: నారాయణఖేడ్ ఎమ్మెల్యే
పేదవారి కష్టం తెలిసిన వాడిగా నారాయణఖేడ్ నియోజకవర్గంలో
దిశ, నారాయణఖేడ్: పేదవారి కష్టం తెలిసిన వాడిగా నారాయణఖేడ్ నియోజకవర్గంలో అపరిష్కృతంగా ఉన్న అనేక సమస్యలను పరిష్కరించి పేదవారికి అండగా ఉంటూ స్థానిక ఎమ్మెల్యే పట్లోళ్ల డాక్టర్ సంజీవరెడ్డి అన్నారు. పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే పటోళ్ల సంజీవరెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు సంవత్సరం కాలం పూర్తయిన సందర్భంగా పురస్కరించుకుని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా ప్రతినిధులు అనేక అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టినట్లు దానిలో భాగంగా నాగలి గిద్ద మండల కేంద్రంలో 10 లక్షల సిసి రోడ్డు నిర్మాణం, నాగల్ గిద్ద మండలం పరిధిలోని మావి నెల్లి నుండి గొందేగావ్ వరకు రూ. 2 కోట్ల 15 లక్షల రూపాయల బీటీ రోడ్డు, కల్లేరు మండలం కేంద్రంలో ఎన్ఆర్ఈజీఎస్ ఐదు లక్షలు, మనూర్ మండల కేంద్రంలో ఎన్ఆర్ఇజిఎస్ రూ.10 లక్షలు శంకుస్థాపన చేశారు.
ఈ కార్యక్రమంలో డీసీసీ ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ రెడ్డి, రాష్ట్ర యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి రాకేష్ షెట్కార్, కాంగ్రెస్ మండలాల అధ్యక్షులు పోచయ్య, తహేర్ అలీ, జహీరాబాద్ మాజీ పార్లమెంటు అధ్యక్షుడు వినోద్ పటేల్, బంజారా సేవాలాల్ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కర్ర రమేష్ చౌహన్, మాజీ ఎంపిటిసి పండరెడ్డి, జిల్లా కాంగ్రెస్ నాయకులు బి రాజు, నాయకులు పండిత్ నాయక్, శివ కాంత్, సంగమేష్ పటేల్, చరణ్, గుండు పటేల్, అనిల్ పటేల్, అండర్ నాథ్ పటేల్, రూప్ సింగ్, మనోహర్, బసవరాజ్, జ్ఞానవరావు పటేల్, నారాయణ జాదవ్, రాఘవా చారి, దిగంబర్ రెడ్డి, బ్రహ్మానందరెడ్డి, సంజీవులు, శివాజీ పటేల్, శ్రీకాంత్ రెడ్డి, జగదీశ్వర్ రెడ్డి ,సాయిలు, శివ కాంత్, విష్ణువర్ధన్ రెడ్డి, అమృత్, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.