సమగ్ర శిక్ష ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని నిరసన

సమగ్ర శిక్ష ఉద్యోగులను రాష్ట్ర ప్రభుత్వం రెగ్యులర్ చేయడంతో పాటు

Update: 2024-11-27 09:59 GMT

దిశ,వర్గల్: సమగ్ర శిక్ష ఉద్యోగులను రాష్ట్ర ప్రభుత్వం రెగ్యులర్ చేయడంతో పాటు పేస్కేలు అమలు చేయాలని రాష్ట్ర సమగ్ర శిక్షా ఉద్యోగుల సంఘం రాష్ట్ర కమిటీ పిలుపు నిచ్చారు.ఈ మేరకు మంగళవారం వర్గల్ మండల శాఖ ఆధ్వర్యంలో సమగ్ర శిక్షా ఉద్యోగు నల్ల బ్యాడ్జీలు ధరించి భోజన విరామ సమయంలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా టీఎస్ఎస్ఈయూఎస్ రాష్ట్ర అధ్యక్షుడు దుండిగల్ యాదగిరి మాట్లాడుతూ.. గత సంవత్సరం సెప్టెంబరులో సమగ్ర శిక్ష ఉద్యోగులు హన్మకొండ లో సమ్మె చేస్తున్న సందర్భంగా శిబిరానికి అప్పటి టీపీసీసీ అధ్యక్షుడు, ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి మద్దతు తెలిపారని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే నెల రోజుల్లో సమగ్ర శిక్ష ఉద్యోగులను రెగ్యులర్ చేస్తామన్నారన్నారు.కానీ ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం కావొస్తున్న ఇప్పటి వరకు హామీలు నెరవేరలేదు.వెంటనే ప్రభుత్వం స్పందించి ఇచ్చిన హామీని నెరవేర్చాలని డిమాండ్ చేశారు.లేనిచో డిసెంబర్ మొదటి వారంలో సమగ్ర శిక్ష ఉద్యోగులు సమ్మె కు వెళ్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో నవీన్, కరుణాకర్ భూపాల్ బలరాం తదితరులు పాల్గొన్నారు.


Similar News