Tata Power Solar: ఫ్లోటింగ్ సోలార్ ప్రాజెక్ట్‌ను ప్రారంభించిన టాటా..
Tata Power Solar Launches India's Largest Floating Solar Project In Kerala| టాటా పవర్ యాజమాన్యంలోని అనుబంధ సంస్థ అయిన టాటా పవర్ సోలార్ సిస్టమ్స్ లిమిటెడ్ (టాటా పవర్ సోలార్) శనివారం కేరళలో భారతదేశంలోనే అతిపెద్ద ఫ్లోటింగ్(నీటిపై తేలియాడే) సోలార్
దిశ, వెబ్‌డెస్క్: Tata Power Solar Launches India's Largest Floating Solar Project In Kerala| టాటా పవర్ యాజమాన్యంలోని అనుబంధ సంస్థ అయిన టాటా పవర్ సోలార్ సిస్టమ్స్ లిమిటెడ్ (టాటా పవర్ సోలార్) శనివారం కేరళలో భారతదేశంలోనే అతిపెద్ద ఫ్లోటింగ్(నీటిపై తేలియాడే) సోలార్ పవర్ ప్రాజెక్ట్‌ను ప్రారంభించింది. కేరళలోని కాయంకుళం వద్ద ఉన్న 350 ఎకరాల బ్యాక్ వాటర్ ప్రాంతంలో 101.6(MWp) మెగావాట్ల పీక్ సామర్థ్యంతో కొత్త ప్రాజెక్ట్‌ను నిర్మించారు. ఈ ప్రాజెక్టు పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ కేటగిరీ ద్వారా ఫ్లోటింగ్ సోలార్ ఫోటోవోల్టాయిక్ లో మొదటిది. 'ప్రాజెక్టు నిర్మాణంలో నీటి లోతు హెచ్చుతగ్గులు, అధిక సముద్రపు అలలు, తీవ్రమైన నీటి లవణీయత సమస్యలు ఎదురైనప్పటికీ, నిర్ణీత వ్యవధిలో నిర్మాణాన్ని పూర్తి చేసినట్లు టాటా పవర్ సోలార్ ఒక ప్రకటనలో' తెలిపింది.
భారత్‌లో మొట్టమొదటగా నీటిపై తేలియాడే అతిపెద్ద సోలార్ ప్రాజెక్ట్‌ను నిర్మించడం ద్వారా, పెరుగుతున్న భవిష్యత్తు విద్యుత్ అవసరాలను తీర్చవచ్చు. దేశం క్రమంగా హరిత ఇంధనాల వైపు అడుగులు వేస్తుంది. ఈ ప్రత్యేకమైన సోలార్ ప్రాజెక్ట్‌ను అందించడానికి అలుపెరుగని కృషి చేసినట్లు టాటా పవర్ CEO, MD ప్రవీర్ సిన్హా అన్నారు. ఈ ప్లాంట్ 5 మెగావాట్ల (MW) కెపాసిటీ కలిగిన ఫ్లోటింగ్ ఇన్వర్టర్‌ను కలిగి ఉంది.
టాటా పవర్ రెన్యూవబుల్స్ ప్రెసిడెంట్ ఆశిష్ ఖన్నా మాట్లాడుతూ.. భారతదేశపు అతిపెద్ద తేలియాడే సోలార్ ప్రాజెక్ట్‌ను ప్రారంభించడం పట్ల సంతోషిస్తున్నాము. ఈ ప్రాజెక్ట్ టాటా పవర్ సోలార్ నిబద్ధతను బలోపేతం చేస్తుంది. 2030 నాటికి సౌర శక్తి ద్వారా 500 GW విద్యుత్ ఉత్పత్తిని సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. ఈ ప్లాంట్ నుండి ఉత్పత్తి చేయబడిన మొత్తం విద్యుత్‌ను కేరళ స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డ్ (KSEB) ఉపయోగిస్తుంది. సోలార్ మాడ్యూల్‌లను అధిక గాలులు, అలలు తట్టుకునేలా ఏర్పాటుచేశారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా కంపెనీ మొత్తం యుటిలిటీ-స్కేల్ సోలార్ ప్రాజెక్ట్ పోర్ట్‌ఫోలియో 9.7 GWpకి పెరిగింది.