మాల్దీవుల్లో ఐస్ క్రీమ్ అమ్ముతున్న స్టార్ హీరోయిన్.. ఫొటో వైరల్
దిశ, వెబ్‌డెస్క్ : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ మిల్క్ బ్యూటీ తమన్న ప్రస్తుతం మాల్దీవులో ఎంజాయ్ చేస్తోంది.
దిశ, వెబ్‌డెస్క్ : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ మిల్క్ బ్యూటీ తమన్న ప్రస్తుతం మాల్దీవులో ఎంజాయ్ చేస్తోంది. ఈ అందాల ముద్దుగుమ్మ శ్రీ సినిమాతో తెలుగు చిత్రపరివ్రమకు పరిచయమై స్టార్ హీరోస్ అందరి సరసన ఆడి పాడింది. ఇక ప్రస్తుతం ఈ అమ్మడు ఎఫ్ 3లో నటిస్తుంది. కాగా ఏ కాస్త సమయం దొరికినా విహారయాత్రలు చేస్తూ ఏంజాయ్ చేస్తుంది మిల్క్ బ్యూటీ. అయితే ప్రస్తుతం తమన్న మాల్దీవుల్లో ఐస్ క్రీమ్ అమ్ముతూ ఉన్న ఫొటో ఒకటి వైరల్‌గా మారింది. పింక్ డ్రెస్ చేతిలో ఐస్ క్రీమ్ అమ్మే సైకిల్‌తో ఈ అమ్మడు కుర్రకారు మతి పోగొడుతుంది. ఇక అంత చలిలో కూడా చిట్టి డ్రెస్‌లో.. ఐస్ క్రీమ్ అమ్ముతూ యూత్ గుండెల్లో చలిమంటలు పుట్టిస్తుంది తమన్నా అంటూ కామెంట్ చేస్తున్నారు అభిమానులు.