కాంగ్రెస్ భారీ యాక్షన్ ప్లాన్.. ఏప్రిల్ 1నుంచి యుద్ధమేనన్న రేవంత్ రెడ్డి..
దిశ, డైనమిక్ బ్యూరో: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో టీ కాంగ్రెస్ నేతల భేటి ముగిసింది.- latest Telugu news
దిశ, డైనమిక్ బ్యూరో: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో టీ కాంగ్రెస్ నేతల భేటి ముగిసింది. ఈ సందర్భంగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ సభ్యులందరికీ రూ.2 లక్షల యాక్సిడెంటల్ 6.34 కోట్లను న్యూ ఇండియా అష్యురెన్స్ కంపెనీకి ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 1 నుంచి కాంగ్రెస్ పార్టీ క్రియాశీల సభ్యత్వం పొందిన ప్రతి ఒక్కరి రూ.2 లక్షలు ప్రమాద బీమా పొందనున్నట్లు వెల్లడించారు. ఇప్పటి వరకు పార్టీ సభ్యత్వాల మీద దృష్టి పెట్టామని, ఏప్రిల్ 1నుంచి ప్రజలు, రైతులు, నిరుద్యోగల సమస్యలపై దీర్ఘకాలిక పోరాటం చేస్తామని ప్రకటించారు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం ఎదుర్కొంటున్న ధాన్యం కొనుగోళ్లపై ఉదృతంగా పోరాటం చేయాలని నిర్ణయించుకున్నామని, దీనికి రాహుల్ గాంధీ కూడా హాజరుకావాలని కోరినట్లు తెలిపారు.
Congress leader Rahul Gandhi Ji with the @INCTelangana Team handed over the Cheque to @newindiaassuran as the premium amount for the 40 lakh Congress members in Telangana. First national party to insure its members.. First @INCTelangana leads by example1/2 pic.twitter.com/Vz8CGVkh33
— Manickam Tagore .B🇮🇳✋மாணிக்கம் தாகூர்.ப (@manickamtagore) March 30, 2022