స్వామి పరిపూర్ణానంద సంచలన వ్యాఖ్యలు.. వాళ్లు దేవతలే అంటూ..

దిశ, మల్లాపూర్: ఆదివాసీల ఆరాధ్య దైవం సమ్మక్క సారలక్కలపై చిన జీయర్ స్వామి చేసిన వ్యాఖ్యలను విబేధించారు స్వామి పరిపూర్ణానంద.

Update: 2022-03-18 09:09 GMT

దిశ, మల్లాపూర్: ఆదివాసీల ఆరాధ్య దైవం సమ్మక్క సారలక్కలపై చిన జీయర్ స్వామి చేసిన వ్యాఖ్యలను విబేధించారు స్వామి పరిపూర్ణానంద. వారిద్దరూ కూడా కాళి మాత స్వరూపాలని, మహాలక్ష్మీ, పార్వతిలకు ప్రతిరూపాలను, లేనట్టయితే వారు పసుపు కుంకుమలుగా మారిపోయారన్నారు. శుక్రవారం జగిత్యాల జిల్లా మల్యాల మండలం ధాంరాజ్ పల్లిలో శ్రీ విశ్వేశ్వర మహాపీఠంలో శ్రీచక్ర ఆలయానికి భూమిపూజ చేశారు. అనంతరం భక్తులకు ప్రవచనాలు చేస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. చినజీయర్ స్వామి ఏదో అలా అనేశారని, ఆదివాసీ బిడ్డలు శతాబ్దాలుగా ఆరాధిస్తున్న వన దేవతలకు మొక్కులు తీర్చుకునేందుకు మహారాష్ట్ర, చత్తీస్ గడ్, కర్నాటకతో పాటు తెలుగు రాష్ట్రాల నుండి కోట్లాది మంది భక్తులు వెల్తుంటారన్నారు. కొండల్లో, గుట్టల్లో ఉండే వారికి కమ్యూనికేషన్ లేకున్నా ప్రతి రెండేళ్లకోసారి జరిగే సమ్మక్క, సారలక్క జాతరలకు వస్తుంటారన్నారు. ప్రపంచంలోనే అత్యంత అరుదైన పండగ ఇదేనని, మేడారం తెలంగాణాలో ఉండడం గర్వకారణమన్నారు. కుంభమేళకు ఎంతమంది హాజరవుతారో అంతే స్థాయిలో సమ్మక్క సారలక్క జాతరకు వస్తుంటారన్నారు. కొండప్రాంత వాసులను పెడుతున్న చిత్ర హింసలను తట్టుకోలేక కత్తిపట్టి యుద్దం చేశారంటే దైవంశ సంభూతులు కాబట్టే సాధ్యపడిందన్నారు.


నడిరోడ్డుపై మందు బాటిల్‌తో టీఆర్ఎస్ ఎమ్మెల్యే వీరంగం


Tags:    

Similar News