Fear: సస్పెన్స్ థ్రిల్లర్‌ ‘ఫియర్’ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్.. క్యూరియాసిటీ పెంచుతున్న పోస్టర్

యంగ్ హీరోయిన్ వేదిక(Vedhika) లీడ్ రోల్‌లో నటిస్తున్న తాజా సినిమా ‘ఫియర్’(Fear).

Update: 2024-11-26 08:12 GMT

దిశ, సినిమా: యంగ్ హీరోయిన్ వేదిక(Vedhika) లీడ్ రోల్‌లో నటిస్తున్న తాజా సినిమా ‘ఫియర్’(Fear). దీనిని దత్తాత్రేయ(Dattatreya) మీడియా బ్యానర్ పై ప్రొడ్యూసర్స్ డా. వంకి పెంచలయ్య, ఏఆర్ అభి నిర్మిస్తున్నారు. సుజాత రెడ్డి(Sujatha Reddy) కో ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు.‌ సస్పెన్స్ థ్రిల్లర్ కథతో రాబోతున్న ఈ చిత్రాన్ని దర్శకురాలు డా. హరిత గోగినేని తెరకెక్కిస్తున్నారు. అయితే ఈ చిత్రం విడుదల కాకుండానే వివిధ అంతర్జాతీయ ప్రతిష్టాత్మక ఫిలిం ఫెస్టివల్స్‌లో 70 కి పైగా అవార్డ్స్‌లను గెల్చుకుని కొత్త రికార్డ్ క్రియేట్ చేసింది.

ఇప్పటికే హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం(Malayalam)లో రిలీజ్ చేసిన ‘ఫియర్’(Fear) టీజర్‌కు హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది. ఈ క్రమంలో.. తాజాగా, మేకర్స్ ‘ఫియర్’ సినిమా రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేస్తూ ఓ ఆసక్తికర పోస్టర్‌ను షేర్ చేశారు. డిసెంబర్ 14న ఈ చిత్రం గ్రాండ్‌గా థియేటర్స్‌లో విడుదల కాబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ప్రజెంట్ ఈ పోస్టర్ ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ(Curiosity)ని పెంచుతోంది. ఒక డిఫరెంట్ సస్పెన్స్ థ్రిల్లర్‌గా రాబోతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

Tags:    

Similar News