Shani Dev: త్వరలో రాశిని మార్చుకోనున్న శని దేవుడు .. ఈ రాశుల వారికీ డబ్బే డబ్బు
జ్యోతిష్య శాస్త్రంలో ( Astrology) ముఖ్య గ్రహాల సంచారం కారణంగా కొందరి జీవితాలు మారనున్నాయి.
దిశ, వెబ్ డెస్క్ : జ్యోతిష్య శాస్త్రంలో ( Astrology) ముఖ్య గ్రహాల సంచారం కారణంగా కొందరి జీవితాలు మారనున్నాయి. 2025 లో కొన్ని గ్రహాలు వాటి స్థానాలను మార్చుకోనున్నాయి. అంతేకాకుండా, దీని ప్రభావం 12 రాశుల వారిపైన చూపనుంది. గ్రహాలలో శని దేవుడు నెమ్మదిగా కదులుతుంటాడు. ప్రస్తుతం, శని కుంభ రాశిలో ఉన్నారు. అయితే, త్వరలో తన స్థానాన్ని మార్చుకోనున్నాడు. దీని కారణంగా రెండు రాశుల వారు లాభాలను పొందనున్నారు. ఆ రాశులేంటో ఇక్కడ తెలుసుకుందాం..
మేష రాశి
చాలా కాలం నుంచి నిలిచిపోయిన పనులను పూర్తి చేస్తారు. మీ పనిని సీనియర్లు మెచ్చుకుంటారు. పాత భూములకు రేట్లు విపరీతంగా పెరుగుతాయి. వ్యాపారాలు చేసే వారికీ ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. కోపాన్ని నియంత్రించుకుంటే కొన్ని పనుల్లో విజయాలు సాధించగలుగుతారు.
వృషభ రాశి
మీరు మొదలు పెట్టిన కొత్త పనుల్లో మీ జీవిత భాగస్వామి మద్ధతు ఉంటుంది. మీ వద్ద అప్పుగా తీసుకున్న డబ్బును మళ్ళీ మీ వద్దకు తిరిగి వస్తుంది. మునుపటి కంటే మీ వైవాహిక జీవితం అద్భుతంగ ఉంటుంది. పెట్టుబడులు పెట్టిన వారికి ఆకస్మిక ధన లాభం ఉంటుంది. విదేశాలకు వెళ్లానుకునే వారి కల నెరవేరుతుంది.
గమనిక: ఇక్కడ అందించిన సమాచారం ఇంటర్నెట్ నుంచి తీసుకోబడింది. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు జ్యోతిష్యులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘దిశ’ ఈ విషయాలను దృవీకరించడం లేదు.