Malavya Rajyog: మాలవ్య రాజయోగం.. ఆ రాశులవారికి బంఫర్ బెనిఫిట్స్.. డబ్బే..డబ్బు!
జ్యోతిష్య శాస్త్రంలో ( Astrology) ముఖ్య గ్రహాల సంచారం కారణంగా కొందరి జీవితాలు మారనున్నాయి.
దిశ, వెబ్ డెస్క్ : జ్యోతిష్య శాస్త్రంలో ( Astrology) ముఖ్య గ్రహాల సంచారం కారణంగా కొందరి జీవితాలు మారనున్నాయి. 2025 లో కొన్ని గ్రహాలు వాటి స్థానాలను మార్చుకోనున్నాయి. అంతేకాకుండా, దీని ప్రభావం 12 రాశుల వారిపైన చూపనుంది. ఈ నెలలో ఎంతో శక్తివంతమైన గ్రహాలు రాశి సంచారం చేయబోతున్నాయి. ముఖ్యంగా, ఇదే నెలలో శుక్రుడు కూడా మీనరాశిలోకి ప్రవేశించడం వలన మాళవ్య రాజ్యయోగం రాజయోగం ఏర్పడబోతోంది. దీని కారణంగా, రెండు రాశుల వారికీ మంచిగా ఉండనుంది. ఆ రాశులేంటో ఇక్కడ తెలుసుకుందాం..
మీన రాశి
మీనరాశిలోకి శుక్రుడు ప్రవేశించడం వలన ఈ రాశి వారు లాభ పడనున్నారు. అంతే కాకుండా, పెండింగ్ పనులు పూర్తి చేస్తారు. కొన్ని రాశులవారికి అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి. వీరికి సమాజంలో గౌరవం, కీర్తి, ప్రతిష్టలు కూడా పెరుగుతాయి. అనుకున్న పనులల్లో విజయం సాధిస్తారు.
వృషభ రాశి
వృషభ రాశివారికి అనేక ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా, కొత్తగా వ్యాపారాలు మొదలు పెట్టిన వారికీ ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. అలాగే, వీరు కొత్తగా ఆస్తులు కూడా కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా, కారు లేదా ఇల్లు కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. ఉద్యోగాలు చేసేవారికి కొత్త అవకాశాలు వస్తాయి.
గమనిక: ఇక్కడ అందించిన సమాచారం ఇంటర్నెట్ నుంచి తీసుకోబడింది. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు జ్యోతిష్యులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘దిశ’ ఈ విషయాలను దృవీకరించడం లేదు