ఇక కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై యుద్ధమే..
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రోల్, విద్యుత్ చార్జీలను పెంచి సామాన్య ప్రజల నడ్డి విరుస్తున్నాయని, పెంచిన ధరలను తగ్గించే వరకు రెండు ప్రభుత్వాలపై కాంగ్రెస్
దిశ, సూర్యాపేట : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రోల్, విద్యుత్ చార్జీలను పెంచి సామాన్య ప్రజల నడ్డి విరుస్తున్నాయని, పెంచిన ధరలను తగ్గించే వరకు రెండు ప్రభుత్వాలపై కాంగ్రెస్ పార్టీ యుద్ధం చేస్తుందని డీసీసీ అధ్యక్షుడు చెవిటి వెంకన్న యాదవ్ అన్నారు. ఆదివారం స్థానిక రెడ్ హౌస్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పెంచిన ధరలకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో 4వ తేదీన అంబేద్కర్ విగ్రహాల ముందు జరిగే నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు డ్రామాలు ఆడుతూ, రైతులను నట్టేట ముంచుతున్నాయని ఆయన ఆగ్రహం వ్యక్తంచేశారు. పూర్తి ధాన్యం కొనేంత వరకు కాంగ్రెస్ పార్టీ ఉద్యమం చేస్తుందని అన్నారు. ఈ సమావేశంలో చకిలం రాజేశ్వర్ రావు, అంజద్ అలీ, కెక్కిరేణి శ్రీనివాస్, కుందమల్ల శేఖర్, నాగుల వాసు, కర్ణాకర్ రెడ్డి, ఐలమల్లు, నరేందర్ నాయుడు, రాము తదితరులు పాల్గొన్నారు.