స్టార్ హీరో కూతురిపై విమర్శలు.. తండ్రిని కూడా పట్టించుకోకుండా..

దిశ, సినిమా : బ్యూటిఫుల్ స్టార్ కిడ్ సుహానా ఖాన్‌ దారుణమైన ట్రోలింగ్ ఎదుర్కొంటోంది. జోయా అక్తర్ ప్రాజెక్ట్ ‘ది ఆర్చీస్’తో బాలీవుడ్‌కు ఎంటర్ కాబోతున్న సుహాన.. తాజాగా ముంబై సిటీలో హల్ చల్ చేసింది..Latest Telugu News

Update: 2022-06-22 07:24 GMT

దిశ, సినిమా : బ్యూటిఫుల్ స్టార్ కిడ్ సుహానా ఖాన్‌ దారుణమైన ట్రోలింగ్ ఎదుర్కొంటోంది. జోయా అక్తర్ ప్రాజెక్ట్ 'ది ఆర్చీస్'తో బాలీవుడ్‌కు ఎంటర్ కాబోతున్న సుహాన.. తాజాగా ముంబై సిటీలో హల్ చల్ చేసింది. ఈ క్రమంలో ఫొటోలు క్లిక్ అనిపించేందుకు మీడియా సిద్ధంగా ఉండగా.. తను మాత్రం ఎలాంటి రియాక్షన్ లేకుండా సైలెంట్‌గా లోపలికి వెళ్లిపోయింది.

ఫొటోగ్రాఫర్స్ రిక్వెస్ట్ చేసినా సరే పట్టించుకోనట్లుగా ప్రవర్తించింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కాగా.. నెటిజన్స్ ట్రోల్ చేస్తున్నారు. 'ఎంత పొగరు.. టాలెంట్ ఏమీ లేదు కానీ యాటిట్యూడ్‌లో మాత్రం క్వీన్ అయిపోతుంది' అని కొందరు కామెంట్ చేస్తే.. 'ఫస్ట్ మూవీ కూడా రిలీజ్ కాకముందే ఇంత యాటిట్యూడ్ ఉంటే.. ఒకవేళ స్టార్ అయితే ఎలా బిహేవ్ చేస్తుందో, వాళ్ల నాన్నను కూడా పట్టించుకోదేమో!' అని మరికొందరు విమర్శిస్తున్నారు.


Similar News