మరోసారి ఎంసీఎల్ఆర్ రేటు పెంచిన ఎస్‌బీఐ!

న్యూఢిల్లీ: దేశీయ అతిపెద్ద ప్రభుత్వ రంగ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) తన మార్జినల్ కాస్ట్ ఆఫ్ లెండింగ్ రేటు(ఎంసీఎల్ఆర్)ను సవరిస్తున్నట్టు శుక్రవారం ప్రకటించింది..Latest Telugu News

Update: 2022-07-15 08:16 GMT

న్యూఢిల్లీ: దేశీయ అతిపెద్ద ప్రభుత్వ రంగ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) తన మార్జినల్ కాస్ట్ ఆఫ్ లెండింగ్ రేటు(ఎంసీఎల్ఆర్)ను సవరిస్తున్నట్టు శుక్రవారం ప్రకటించింది. అన్ని కాలపరిమితులపై ఎంసీఎల్ఆర్ రేటును 10 బేసిస్ పాయింట్లు అంటే 0.10 శాతం పెంచుతున్నట్టు వెల్లడించింది. సవరించిన వడ్డీ రేట్లు జూలై 15 నుంచే అమలవుతాయని పేర్కొంది. బ్యాంకు తెలిపిన వివరాల ప్రకారం, ఓవర్‌నైట్, ఒక నెల, మూడు నెలల కాలవ్యవధిపై ఎంసీఎల్ఆర్ రేటు 7.15 శాతంగా ఉంది. ఆరు నెలల కాలవ్యవధి కలిగిన రుణాలపై ఎంసీఎల్ఆర్ రేటు 7.35 శాతం నుంచి 7.45 శాతానికి, ఏడాది కాలవ్యవధి ఉన్న ఎంసీఎల్ఆర్ 7.40 శాతం నుంచి 7.50 శాతానికి, రెండేళ్ల కాలవ్యవధిపై 7.60 శాతం నుంచి 7.70 శాతానికి, మూడేళ్ల కాలవ్యవధిపై 7.70 శాతం నుంచి 7.80 శాతానికి పెంచారు.

ఎంసీఎల్ఆర్ రేటు పెంపు వల్ల వినియోగదారులు తీసుకునే ఇళ్ల రుణాలు మొదలుకొని, వాహన, వ్యక్తిగత రుణాలపై ఈఎంఐ భారం పడనుంది. ఇప్పటికే ఎస్‌బీఐ ఒకసారి ఎంసీఎల్ఆర్ రేటును పెంచింది. జూన్‌లో బ్యాంకు 20 బేసిస్ పాయింట్లు పెంచిన సంగతి తెలిసిందే. ఎస్‌బీఐతో పాటు ఇటీవలే ఇతర బ్యాంకులు సైతం ఎంసీఎల్ఆర్ రేట్లను సవరించాయి. ఎస్‌బీఐలో ప్రస్తుతం ఇళ్ల రుణాలపై వడ్డీ రేట్లు 7.05 శాతం నుంచి 7.55 శాతం మధ్య ఉండగా, వాహన రుణాలపై 7.45 శాతం నుంచి 8.15 శాతం మధ్య ఉన్నాయి. ఈ వడ్డీ రేట్లు వినియోగదారుల క్రెడిట్ స్కోర్ ఆధారంగా వడ్డీ రేట్లు అమలవుతాయి.   


Similar News