'దిశ' స్పెషల్ ఫోకస్ : గంటకో రేటు.. నగర నడిబొడ్డున 'సరసమైన' స్టార్ హోటల్స్
నిజామాబాద్ మెట్రో నగరాలను తలపిస్తోంది. ఇది అభివృద్ధిలో అనుకుంటే పొరబడిపట్టే.. అసాంఘిక కార్యక్రమాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారి హైదరాబాద్‌ను తలదన్నేలా
Star hotels in Nizamabad have become spots for illegal activities.
దిశ ప్రతినిధి, నిజామాబాద్: నిజామాబాద్ మెట్రో నగరాలను తలపిస్తోంది. ఇది అభివృద్ధిలో అనుకుంటే పొరబడినట్టే.. అసాంఘిక కార్యక్రమాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారి హైదరాబాద్‌ను తలదన్నేలా మారిందంటే అతిశయోక్తి కాదు. గతంలో జిల్లా కేంద్రంలో గుట్టుచప్పుడు కాకుండా పత్తాలాట, బెట్టింగ్, వ్యభిచార కేంద్రాలను నిర్వహించుకునేవారు. కానీ మారిన టెక్నాలజీ పుణ్యామా అని అర చేతిలో సెల్ పట్టుకుని తమ కోరికలు తీర్చుకుంటున్నారు. ఇంటర్ విద్యార్థుల నుంచి ప్రముఖుల వరకు లాడ్జీలు, స్టార్ హోటళ్లను బుక్ చేసుకుని నచ్చిన అమ్మాయితో ఎంజాయ్ చేస్తున్నారు. రాష్ట్ర రాజదానికి దూరంగా ఉన్న నిజామాబాద్ జిల్లా కేంద్రానికి 'ఎస్కార్ట్' ఎంటర్ కావడంతో ఈజీగా సెక్స్ అందుబాటులోకి వచ్చింది. ఆన్‌లైన్‌లో అమ్మాయిని, లాడ్జీని బుక్ చేసుకుని ఎంజాయ్ చేస్తున్నారు.
హైదరాబాద్‌లాంటి మెట్రో నగరాలకు పరిమితమైన ఎస్కార్ట్ (వ్యభిచారం) సేవల విషపు బీజాలు నిజామాబాద్‌లో ఎంటర్ అయ్యాయి. నిన్న, మొన్నటి వరకు ఇళ్లలో పోలీసుల రైడ్‌లు చేసే వరకు గుట్టుగా సాగిన ఈ దందా.. నేడు చేతిలో ఇమిడిపోయే స్మార్ట్ ఫోన్ ద్వారా చిన్న, పెద్ద తేడా లేకుండా అందరినీ ఆకర్షిస్తోంది. స్మార్ట్ ఫోన్‌లో అందమైన అమ్మాయిల ఫొటోలు, వారి రేట్ ఫిక్స్ చేసి కొందరు వాట్సాప్ గ్రూపుల్లో వేస్తున్నారు. ఇలా నిజామాబాద్ జిల్లా కేంద్రంలో విచ్చలవిడిగా ఈ అసాంఘిక కార్యకలపాలు ఎవరికీ చిక్కకుండా కొనసాగుతున్నాయి. ఈ హైటెక్ వ్యభిచారం హోటళ్లు, లాడ్జీల కేంద్రంగా సాగుతోంది. ప్రేమికులు మొదలుకుని, వివాహేతర సంబంధాలు కలిగిన వారు గడిపేందుకు స్టార్ హోటల్‌తో పాటు లాడ్జీలను ఎంచుకుంటున్నారు. ఈ నెల 14న జిల్లా కేంద్రంలో సోషల్ మీడియాలో ఎస్కార్ట్ సేవల గురించి వచ్చిన పోస్టు తెగ వైరల్ అయ్యింది. ఓ స్టార్ హోటల్‌లో 'ఎస్కార్ట్' సేవలు సారాంశంగా వచ్చిన పోస్టు సంచలనమైంది. ఆ రోజు కొందరు యువతులను కార్లలో తీసుకువచ్చి.. కోరుకున్న వారికి అప్పగించినట్లు తెలిసింది. తరువాత రెండు రోజులకు పోలీసులు రైడ్ చేసినా ఆ విషయాన్ని మాత్రం బహిర్గతం చేయలేదు. ఆ హోటల్‌కు ఓ ప్రజాప్రతినిధి అండ ఉందనే చర్చ జరుగుతోంది.
ఎస్కార్ట్ నెట్‌వర్క్‌లో ఈ దందాను నిర్వహిస్తున్న వారు సెల్ ఫోన్‌లోని వాట్సాప్, ఇన్‌స్టా గ్రామ్ లాంటి సోషల్ మీడియా యాప్‌ల ద్వారా యువకులను, పెద్దలను రప్పిస్తున్నారు. అందులోనే యువతుల ఫొటోలను షేర్ చేస్తున్నారు. గంటకు, మూడు గంటలకు, రాత్రంతా అని ప్రత్యేకంగా రేట్లను ఫిక్స్ చేసి ఓపెన్ ఆఫర్‌తో సోషల్ మీడియాలో పెడుతున్నారు. యువతుల ఫొటోలను పెట్టి రప్పిస్తుండటంతో ఇప్పుడు చాలామంది ఈజీ ప్రాసెస్, రిస్క్ లేని ఎంజాయ్‌గా ఎస్కార్ట్ సేవలను ఆస్వాదిస్తున్నారు. యువతి, వయస్సుతో పాటు లాడ్జీంగ్ బోర్డింగ్ లాంటి సకల సౌకర్యాలను కల్పిస్తున్నారు. దానితో ఈ ఎస్కార్ట్ సేవలకు యువతతో పాటు పెద్దలు ఆకర్షితులు అవుతున్నారు. యువతులను ఏకంగా కార్లలో రప్పించి ఎంజాయ్ చేసేవారు కోరుకున్న చోటుకు పంపిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. అంతా ఆన్ లైన్ పేమెంట్ కావడంతో ఈ దందా సాఫీగా సాగుతోంది.
విటులు తాము నేరుగా హోటల్, లాడ్జికి వెళ్లకుండా ఫోన్‌లోనే కావాల్సిన సమయంలో యువతులను ఆన్‌లైన్‌లో బుకింగ్ చేసుకుంటున్నారు. మరికొందరు యాప్‌లను డౌన్ లోడ్ చేసుకుని పలానా హోటల్, పలానా లాడ్జీలో ఎలాంటి సేవలు అందుబాటులో ఉన్నాయని తెలుసుకుని ఈజీగా బుక్ చేసుకుంటున్నారు. ఆన్‌లైన్‌లో బుకింగ్ కావడంతో హోటల్, లాడ్జ్‌ల యజమానులు సైతం గదులు ఇచ్చి సహకరిస్తున్నారు. అక్కడ వారు ఏమి చేస్తున్నారని అడిగే నాథుడు ఉండటం లేదు. లాడ్జీలకు విద్యార్థులు వస్తున్నా కిక్కురుమనకుండా గదులు ఇస్తున్నారు. అక్కడ వారు గంటల కొద్ది ఎంజాయ్ చేస్తూ మెల్లగా జారుకుంటున్నారు. ప్రస్తుతం జిల్లా కేంద్రంలో 'ఎస్కార్ట్' ఎంజాయ్ విధానానికి కేరాఫ్‌గా స్టార్ హోటళ్లు, లాడ్జీలు మారాయనడంతో సందేహం లేదని ప్రజలు పేర్కొంటున్నారు.
నో ప్రూఫ్స్, నో రూల్స్.. ఆ రిసార్ట్ లో రూ.2 వేలకే కావాల్సినంత ఎంజాయ్‌మెంట్