Mokshagna Teja: నందమూరి మోక్షజ్ఞ సినిమాలో స్టార్ హీరోయిన్ కూతురు ఫిక్స్!
నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ(Mokshagna Teja) హీరోగా టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే.
దిశ, సినిమా: నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ(Mokshagna Teja) హీరోగా టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా విడుదలైంది. దీనికి ‘హనుమాన్’(Hanuman) సినిమాతో బ్లాక్ బస్టర్ విజయం సాధించిన ప్రశాంత్ వర్మ(Prashanth Verma) దర్శకత్వం వహిస్తున్నారు. అయితే ఆ మూవీకి ‘సింబ’(Simba) అనే టైటిల్ కూడా పరిశీలిస్తున్నట్లు టాక్. కానీ ఇందులో నటించే నటీనటులకు సంబంధించిన విషయాలు మాత్రం వెల్లడించలేదు. దీనిని ప్రశాంత్ వర్మ లవ్‌స్టోరీతో పాటు రొమాంటిక్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కించబోతున్నట్లు తెలుస్తోంది.
ఈ క్రమంలో.. తాజాగా, మోక్షజ్ఞ సినిమా కోసం ప్రశాంత్ వర్మ (Prashanth Verma)ఓ స్టార్ హీరోయిన్ కూతురిని సెట్ చేసినట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. ఆమె ఎవరో కాదు రవీనా టాండన్ కుమార్తె రాషా ధడాని(rasha thadani) మోక్షజ్ఞసరసన నటించనున్నట్లు టాక్. ఇందుకోసం ఆమె ఆడిషన్ కూడా ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ మూవీకి సంబంధించిన స్టోరీ కూడా ప్రశాంత్ వర్మ చెప్పడంతో గ్రీన్ ఇచ్చిందని.. త్వరలో షూటింగ్ కూడా స్టార్ట్ కానుందని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇందులో నిజమెంత అనేది తెలియనప్పటికీ ఈ విషయం తెలుసుకున్న వారు తెలుగు హీరోయిన్‌ను తీసుకోమని రిక్వెస్ట్ చేస్తున్నారు.