UPI Down : దేశవ్యాప్తంగా నిలిచిపోయిన UPI సేవలు

డిజిటల్ పేమెంట్స్ వ్యవస్థ యూపీఐ(UPI) సేవల్లో తీవ్ర అంతరాయం ఏర్పడింది.

Update: 2025-03-26 14:59 GMT
UPI Down : దేశవ్యాప్తంగా నిలిచిపోయిన UPI సేవలు
  • whatsapp icon

దిశ, వెబ్ డెస్క్ : డిజిటల్ పేమెంట్స్ వ్యవస్థ యూపీఐ(UPI) సేవల్లో తీవ్ర అంతరాయం ఏర్పడింది. దేశవ్యాప్తంగా వినియోగదారులు ఈ ఇబ్బందిని ఎదుర్కొంటున్నట్టు సమాచారం. యూపీఐ సేవలందించే గూగుల్ పే(Google Pay), ఫోన్ పే(Phone Pay) వంటి యాప్స్ పనిచేయడం లేదు. ఈ యాప్స్ లో పేమెంట్స్, ఫండ్ ట్రాన్స్ఫర్ వంటి విషయాల్లో యూజర్స్ అవాంతరాలు ఎదుర్కొంటున్నారు. బుధవారం సాయంత్రం 7 గంటల తర్వాత ఈ సమస్య తలెత్తినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో భారీ సంఖ్యలో వినియోగదారులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. అయితే దీనిపై ఇంతవరకూ ఎన్పీసీఐ(NPCI) గాని, బ్యాంకులు గాని ఎలాంటి ప్రకటన చేయలేదు. 

Tags:    

Similar News