Vivo V50e: వెడ్డింగ్ పోర్ట్రైట్ స్టూడియో ఫీచర్.. ఈ మొబైల్ అదుర్స్ కదూ
Vivo V50e: Vivo త్వరలో భారత్‌లో కెమెరా-సెంట్రిక్ బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేయనుంది.
దిశ, వెబ్ డెస్క్: Vivo V50e: Vivo త్వరలో భారత్‌లో కెమెరా-సెంట్రిక్ బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేయనుంది. ఈ వివో ఫోన్ వివో V50e పేరుతో లాంచ్ కానుంది . ఇది తక్కువ ధరకు హై-ఎండ్ ఫీచర్లతో మార్కెట్లోకి విడుదల చేయనుంది. ఇది భారతదేశానికి ప్రత్యేకమైన వెడ్డింగ్ పోర్ట్రెయిట్ స్టూడియో ఫీచర్ తో లాంచ్ చేసేందుకు సంస్థ సన్నాహాలు చేస్తోంది. ఈ ఫోన్ స్మార్ట్ ఫోన్ ఫీచర్స్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం.
వివో త్వరలోనే భారత్ లో వివో V50e స్మార్ట్‌ఫోన్ లాంచ్ కు సిద్ధమవుతోంది. ఈ రాబోయే స్మార్ట్‌ఫోన్ BIS సర్టిఫికేషన్ వెబ్‌సైట్‌లో కనిపించింది. వివో రాబోయే స్మార్ట్‌ఫోన్ డిజైన్ రెండర్‌లు, కెమెరా ఫీచర్లు కూడా వెల్లడయ్యాయి. వివో రాబోయే ఫోన్ విషయానికొస్తే, ఇది భారతదేశానికి ప్రత్యేకమైన వెడ్డింగ్ పోర్ట్రెయిట్ స్టూడియో ఫీచర్ తో లాంచ్ చేసేందుకు కంపెనీ సన్నాహాలు చేస్తోంది. ఈ ఫోన్ ఫీచర్ల గురించి మరిన్ని వివరాలు చూద్దాం.
MySmartPrice ప్రకారం, Vivo V50e స్మార్ట్‌ఫోన్ ప్రాథమిక కెమెరా 50MP సోనీ IMX882 సెన్సార్‌గా ఉంటుంది. ఇది ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS) మద్దతుతో వస్తుంది. దీనితో పాటు, ఈ కెమెరా సోనీ మల్టీఫోకల్ పోర్ట్రెయిట్స్ సపోర్ట్‌తో వస్తుంది. ఈ ఫోన్ భారతదేశానికి ప్రత్యేకమైన వెడ్డింగ్ పోర్ట్రెయిట్ స్టూడియో ఫీచర్‌తో లాంచ్ అవుతుందని నివేదికలు చెబుతున్నాయి.కెమెరా మాడ్యూల్, కెమెరా ఫీచర్ల గురించి మాట్లాడుకుంటే, ఇది వివో V50 5G మాదిరిగానే ఉంటుంది. అయితే, ఈ వివో ఫోన్ బడ్జెట్ ధరకే హై-ఎండ్ ఫీచర్లతో లాంచ్ అవుతుంది.
రాబోయే వివో V50e స్మార్ట్‌ఫోన్ డిజైన్ గురించి మాట్లాడుకుంటే, ఇది వివో V50 కి చాలా పోలి ఉంటుంది. ఈ ఫోన్ 6.77-అంగుళాల క్వాడ్-కర్వ్ AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. దీని రిజల్యూషన్ 1.5K, రిఫ్రెష్ రేట్ 120Hz ఉంటుంది. ఈ వివో ఫోన్ గురించి మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ప్రాసెసర్, 8 జీబీ ర్యామ్, 256 జీబీ వరకు ర్యామ్‌తో లాంచ్ చేయవచ్చని చెబుతున్నారు. కెమెరా సెటప్ చూసినట్లయితే..ఈ ఫోన్‌లో 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 8 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ సెన్సార్ , సెల్ఫీ కెమెరా కోసం 50 మెగాపిక్సెల్ కెమెరా ఉంటాయని భావిస్తున్నారు. రాబోయే Vivo V50e స్మార్ట్‌ఫోన్ 5600mAh బ్యాటరీతో 90W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతును పొందవచ్చు. ఈ Vivo ఫోన్ ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, IP68+IP69 రేటింగ్‌తో వస్తుంది.
వివో V50e స్మార్ట్‌ఫోన్ ధర విషయానికొస్తే, దీనిని రూ.25 వేల నుండి రూ.30 వేల వరకు లాంచ్ చేయవచ్చని చెబుతున్నారు. ఈ ఫోన్ సఫైర్ బ్లూ పెర్ల్ వైట్ కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది. ఈ ఫోన్‌ను ఏప్రిల్ మధ్యలో లాంచ్ చేయవచ్చు. ప్రస్తుతం కంపెనీ లాంచ్ తేదీకి సంబంధించి ఎలాంటి ప్రకటించలేదు.