Sleep including robot: నిద్ర సమస్యకు చెక్ పెట్టే ఈ గ్యాడ్జెట్స్ గురించి మీకు తెలుసా?
మనిషి ఆరోగ్యానికి ఆహారం ఎంత ముఖ్యమో నిద్ర కూడా అంతే అవసరం.

దిశ, వెబ్ డెస్క్: మనిషి ఆరోగ్యానికి ఆహారం ఎంత ముఖ్యమో నిద్ర కూడా అంతే అవసరం. అందుకే రోజు కచ్చితంగా 8 గంటలు నిద్రపోవాలని వైద్యులు సూచిస్తుంటారు. అయితే, నేటి ఉరుకుల పరుగుల జీవిన శైలిలో చాలా మంది మంచి నిద్రకు దూరమవుతున్నారు. పని వేళలు, ఒత్తిడి, ఆహరపు అలవాట్లు కూడా నిద్రపై తీవ్రంగా ప్రభావం చూపుతున్నాయి. ఫలితంగా నిద్రలేమి (Insomnia) సమస్యతో బాధపడుతున్నారు. ప్రస్తుత సమాజంలో నిద్రలేమి కూడా ప్రధాన ఆరోగ్య సమస్యగా మారిపోయింది. అంతేకాదు, నిద్రలేమితో అనేక దీర్ఘకాలిక వ్యాధులకు కూడా కారణమవుతుందని పలు అధ్యయనాల్లో తేలింది. ఈ క్రమంలోనే మంచి నిద్రకు ఉపక్రమించి, హాయిగా జోలపాడి నిద్రపుచ్చే రోబోలు (Sleep-inducing robots) మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చేశాయి.
ప్రస్తుతం మార్కెట్‌లో అందుబాటులో ఉండే ఈ నిద్రపుచ్చే రోబోలు చిన్న పిల్లో ఆకారంలో ఉంటాయి. రోబోటిక్, ఏఐ టెక్నాలజీతో వీటిని రూపొందించారు. ఇక ఇందులో పాటలు పాడటం, కథలు చెప్పడం, మనసుకు విశ్రాంతి కలిగే శబ్ధాలు వినిపించటం వంటి ఫీచర్లు ఉన్నాయి. అలాంటి వాటిలో ఒకటే ఈ సోమ్నాక్స్ స్లీప్ రోబో (Somnox Sleep Robot). ఇది మిమ్మల్ని నిద్రపోయే ముందు విశ్రాంతి తీసుకోవడానికి బాగా సహాయపడుతుంది. ఇందులో వివిధ ప్రకృతి శబ్దాలు, ఆహ్లాదకరమైన సంగీతంతో పాటు శ్వాస వ్యాయామాలు, ధ్యానం చేసేలా వ్యాల్యూ నియంత్రణలు, లైట్ నైట్ ఎంపికలు వంటి ఆప్షన్లు ఉన్నాయి. దీని ధర ప్రస్తుతం మార్కెట్లో రూ.46,976 గా ఉంది. ఉద్యోగులు చాలా మంది దీని కొనుగోలుకు ఆసక్తి చూపిస్తున్నారు.
నిద్రపుచ్చే రోబోలే కాదు, మార్కెట్లోకి నిద్రకు సంబంధించిన అనేక గ్యాడ్జెట్లు అందుబాటులోకి వచ్చాయి. ఔరా రింగ్ జెన్3తో నిద్రను ట్రాక్ చేయొచ్చు. దీనిని వేలికి ధరించి, మొబైల్ యాప్ సాయంలో ఉపయోగించవచ్చు. నిద్ర వ్యవధి, నాణ్యతతో పాటు హృదయ స్పందన, శ్వాస విధానాలు, శరీర కదలికలను కూడా పర్యవేక్షించి స్లీప్ ఫిట్‌నెస్ స్కోర్‌ను ఇస్తుంది. ఇక దీని ధర రూ. 21,414గా ఉంది. అలాగే, మార్కెట్లో అనేక రకాలైన స్మార్ట్ పరుపులు అందుబాటులోకి వచ్చాయి. ఇందులో ఉండే సెన్సార్లు శరీర ఉష్ణోగ్రతను అనుకూలంగా మార్చి, హాయిగా నిద్రపోయేలా చేస్తాయి.