ఇలాంటి బంకుల్లో పెట్రోల్ కొట్టిస్తున్నారా? అయితే మీరు మోసపోయినట్టే
బైకులు, కార్లలో ప్రతిరోజూ పెట్రోల్ కొట్టిస్తుంటాం. అయితే కొన్ని బంకుల్లో పెట్రోల్ కొట్టిస్తే మైలేజ్ అనేది డ్రాప్ అవుతూ ఉంటుంది.

దిశ, వెబ్ డెస్క్: బైకులు, కార్లలో ప్రతిరోజూ పెట్రోల్ కొట్టిస్తుంటాం. అయితే కొన్ని బంకుల్లో పెట్రోల్ కొట్టిస్తే మైలేజ్ అనేది డ్రాప్ అవుతూ ఉంటుంది. తరచూ ఇచ్చే మైలేజ్ కంటే తక్కువ మైలేజ్ వస్తుంది. అలాంటప్పుడు జాగ్రత్త పడాల్సిందే. తక్కువ మైలేజ్ వస్తే ఆ బంకును మార్చడం మంచింది. మార్చే ముందు పెట్రోల్ కల్తీ జరిగిందా అని అనుమానం ఉంటే మీరు సింపుల్‌గా టెస్ట్ చేయవచ్చు కూడా. దాని కోసం పెట్రోల్ బంక్‌లో ఫిల్టర్ పేపర్ అడగాలి. కన్స్యూమర్ యాక్ట్ ప్రకారం పెట్రోల్ బంక్‌లో నాణ్యత చెక్ చేసేందుకు ఫిల్టర్ పేపర్ అడిగితే ఇవ్వాల్సిందే.
కాబట్టి వారు ఇచ్చిన ఫిల్టర్ పేపర్ పై ఒక చుక్క పెట్రోల్ పోసి చూడండి. పెట్రోల్ మరక లేకుండా పూర్తిగా ఫిల్టర్ పేపర్ గ్రహించుకుంటే ఆ పెట్రోల్ నాణ్యమైనదే అని చెప్పవచ్చు. ఒకవేళ అలాకాకుండా పెట్రోల్ డ్రాప్స్ వేసిన ప్రాంతంలో మరకలా అలాగే ఉండిపోతే పెట్రోల్ లో కల్తీ జరినట్టు. ఇలాంటి బంకుల్లో పెట్రోల్ కొట్టించడం ద్వారా మైలేజీ రాకుండా నష్టపోవడంతో పాటూ మీ వాహనం కూడా త్వరగా పాడయ్యే అవకాశం ఉంది. కాబట్టి పెట్రోల్ బంక్స్‌లో పెట్రోల్ కొట్టించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి.