Microsoft: మరోసారి మైక్రోసాఫ్ట్‌లో లేఆఫ్స్.. ఆ ఉద్యోగులపై ఎఫెక్ట్!
ప్రముఖ టెక్ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ (Microsoft) ఉద్యోగుల్లో మరోసారి లేఆఫ్స్ (layoffs) ఆందోళన కలవరపెడుతోంది.

దిశ, వెబ్ డెస్క్: ప్రముఖ టెక్ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ (Microsoft) ఉద్యోగుల్లో మరోసారి లేఆఫ్స్ (layoffs) ఆందోళన కలవరపెడుతోంది. ప్రాజెక్టులపై కోడర్లు వర్సెస్ నాన్ కోడర్ల నిష్పత్తిని పెంచాలని సంస్థ ఆలోచిస్తోంది. ఈ నేపథ్యంలో భారీగా ఉద్యోగులను తొలగించనుంది. అయితే, ఈ ప్రభావం ప్రధానంగా మిడిల్ మేనేజ్‌మెంట్, నాన్-టెక్నికల్ ఉద్యోగులపై ఉండనుంది. కంపెనీ ఆదాయ, వ్యయాలను సమతుల్యం చేయడమే లక్ష్యంగా మైక్రోసాఫ్ట్ ఈ నిర్ణయం తీసుకుంది. వచ్చే నెలలో ఈ లేఆప్స్ ఉండే అవకాశం ఉంది. అయితే ఈ ఎఫెక్ట్ ఎంతమందిపై ప్రభావం చూపుతుందని విషయం అధికారికంగా వెల్లడికాలేదు. ఓ నివేదిక ప్రకారం వరుసగా రెండు సంవత్సరాలు పనితీరు సమీక్షలలో 'ఇంపాక్ట్ 80' లేదా అంతకంటే తక్కువ స్కోరు పొందిన ఉద్యోగులను తొలగించనున్నట్లు తెలుస్తోంది. గతంలో కూడా మైక్రోసాఫ్ట్ తక్కువ పనితీరు కనబరిచిన 2000 మంది ఉద్యోగులను తొలగించింది. అమెజాన్, గూగుల్ సహా దిగ్గజ కంపెనీలు కూడా ఇదే పని చేశాయి.