Apple: చైనాకు చా*వు దెబ్బ..! ఇండియాకు మారిన ఐఫోన్ల మకాం.. నెక్ట్స్ జరిగేది ఇదే

Apple: అమెరికా దిగ్గజ సంస్థ యాపిల్ తన ఐఫోన్లతోపాటు ఇతర ఉత్పత్తుల తయారీకి మనదేశంలోని కేంద్రాలను మరింత వినియోగించుకునే పరిస్థితులు ఏర్పడుతున్నాయి.

Update: 2025-04-11 04:16 GMT
Apple: చైనాకు చా*వు దెబ్బ..! ఇండియాకు మారిన ఐఫోన్ల మకాం.. నెక్ట్స్ జరిగేది ఇదే
  • whatsapp icon

దిశ, వెబ్ డెస్క్: Apple: అమెరికా దిగ్గజ సంస్థ యాపిల్ తన ఐఫోన్లతోపాటు ఇతర ఉత్పత్తుల తయారీకి మనదేశంలోని కేంద్రాలను మరింత వినియోగించుకునే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. తాజాగా భారత్ నుంచి అమెరికాకు దాదాపు 600 టన్నుల ఐఫోన్లను రవాణా చేసింది. వాటి మొత్తం సంఖ్య దాదాపుగా 15లక్షల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. అమెరికా మార్కెట్లో వాటి లభ్యతను నివారించేందుకు సంభావ్య సుంకాల ప్రభావాన్ని నివారించేందుకు కంపెనీ ఈ పెద్ద షిప్ మెంట్ ను చార్డర్డ్ కార్గొ విమానాల ద్వారా పంపించింది. అమెరికాలో చైనా నుంచి వచ్చే ఎలక్ట్రానిక్స్ పై భారీ సుంకాలు విధించిన సమయంలో ఈ చర్య తీసుకున్నారు.

చైనా నుంచి వచ్చే ఐఫోన్స్ పై గరిష్టంగా 125శాతం వరకు సుంకం విధించింది. ఇది గతంలో 54శాతం ఉంది. భారత్ నుంచి వచ్చే ఉత్పత్తులు కేవలం 26శాతం సుంకాన్ని మాత్రమే ఆకర్షిస్తున్నాయి. ఇది ప్రస్తుతం 90రోజుల పాటు నిలిపివేసింది. ఈ కారణంగానే యాపిల్ చైనా నుంచి కాకుండా భారత్ నుంచి సరఫరాలను పెంచేసింది. చైనా నుంచి దిగుమతులు ఇలాగే కొనసాగితే 1,599 డాలర్ల ఐఫోన్ 16ప్రో మ్యాక్స్ ధర అమెరికాలో 2,300 డాలర్ల వరకు ఉండవచ్చని అంచనా.

ఆపిల్ భారత్ నుంచి అమెరికాకు దాదాపు 1.5 మిలియన్ ఐఫోన్స్ ను రవాణా చేసింది. వీటి మొత్తం విలువ దాదాపు 2.4 డాలర్ల బిలియన్లు. ఈ ఐఫోన్స్ పై చైనా నుంచి రవాణా చేస్తే అవి అమెరికాలో 125శాతం సుంకానికి లోబడి ఉంటాయి. దీని వల్ల యాపిల్ సంస్థకు దాదాపు 3 బిలియన్ల డాలర్ల పన్నులు ఖర్చు అవుతాయి. కానీ షిప్ మెంట్ భారత్ నుంచి వచ్చినందున కంపెనీ ఈ పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ప్రస్తుతం భారత్ నుంచి దిగుమతులపై జీరో శాతం సుంకం ఉంది. సాధారణ పరిస్థితుల్లో ఇది 26శాతంగా ఉండేది.

అయితే ఇప్పటి వరకు అమెరికా వెలుపల తయారు చేస్తున్ను ఐఫోన్లలో భారత్ వాటా 14శాతం కాగా దాదాపు 80శాతం ఐఫోన్లు చైనాలోనే తయారు అవుతున్నాయి. చైనా నుంచి అమెరికాలో దిగుమతి చేసుకుంటే 145శాతం పన్ను కట్టాలంటే వాణిజ్య పరంగా ఏమాత్రం ఉపకరించని అంశమే. ఉదాహరణకు 1000 డాలర్ల విలువైన ఐఫోన్ చైనాలో తయారై..అమెరికాకు వచ్చేసరికి దాని ధర దాదాపు 2450 డాలర్లు అవుతుంది. అదే ఫోన్ భారత్ తయారు చేస్తే అమెరికాకు చేరేసరికి 110 డాలర్లు అవుతుంది. ఒకవేళ ముందుగా ప్రకటించిన 26శాతం ప్రకారమే చూసినా..దాదాపు 1260 డాలర్లు అవుతుంది.

చైనా, భారత్ లో తయారు చేసే ఐఫోన్ల ధరల మధ్య అమెరికా మార్కెట్లో ఇంత భారీ వ్యత్యాసం ఏర్పడుతుంది కాబట్టే భారత్ లో మరిన్ని ఐఫోన్ల తయారీకి యాపిట్ మొగ్గు చూపే ఛాన్స్ ఉంది. సౌదీ అరేబియా, యూఏఈలపై అమెరికా 10శాతం సుంకం విధించినందుకు ఎలక్ట్రానిక్స్ తయారీకి అనువైన వనరులు సమకూర్చుకుంటే భారత్ కు పోటీగా ఎదిగే ఛాన్స్ కూడా ఉంది. 

Tags:    

Similar News