ఇప్పుడు అన్ని గుర్తుంచుకుంటుంది.. జాగ్రత్తగా ఉండాల్సిందేనా..?
చాట్ జీపీటీ ఇప్పుడు మరింత డేంజర్ అయ్యిందనే చెప్పాలి.

దిశ,వెబ్ డెస్క్: చాట్ జీపీటీ ఇప్పుడు మరింత డేంజర్ అయ్యిందనే చెప్పాలి. ప్రతి ఒక్కరు చాట్ జీపీటీ ఉపయోగిస్తున్నారు. గిబ్లి స్టైల్ ట్రెండ్ కావడంతో.. అందరూ తమ ఫోటోలను చాట్ జీపీటీ అప్ లోడ్ చేస్తూ ప్రమాదంలో పడుతున్నారు. అలాగే చాట్ జీపీటీ ఇప్పుడు అనంతమైన మెమరీతో అప్ డేట్ అయ్యింది. అయితే వినియోగదారులు చెప్పిన ప్రతి దాన్ని గుర్తుపెట్టుకుంటుంది. దీని వల్ల యూజర్లు ప్రమాదంలో పడినట్టేనని విశ్లేషకులు అంటున్నారు.
చాట్ జీపీటీ మెమరీ ఫీచర్‌ను అప్‌డేట్ చేస్తున్నట్లు సీఈఓ సామ్ ఆల్ట్‌మాన్ పేర్కొన్నారు. అలాగే చాట్ జీపీటీ మరింత వ్యక్తిగతీకరించిన సహాయకరమైన ప్రతిస్పందనలను అందించడానికి వినియోగదారులు భాగస్వామ్యం చేసిన ప్రతిదాన్ని గుర్తుంచుకోవడానికి అనుమతిస్తుందన్నారు. ఈ ఫీచర్‌ని కాలక్రమేణా మరింత ఉపయోగకరంగా మార్చగల సామర్థ్యాన్ని సీఈఓ ప్రశంసించారు. వినియోగదారులు ప్రభావితం చేయని తాత్కాలిక చాట్‌లను నిలిపివేయాలని తెలిపారు.