AI : ప్రపంచంలో తొలిసారిగా ఏఐ సహాయంతో జననం
రానున్న కాలం అంతా కృత్రిమ మేధస్సు(Artificail Intelligence)తో నిండనుంది.

దిశ, వెబ్ డెస్క్ : రానున్న కాలం అంతా కృత్రిమ మేధస్సు(Artificail Intelligence)తో నిండనుంది. అన్ని పనులు, సేవలు ఏఐ(AI)తో జరుగుతాయి అంటే ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదేమో. తాజాగా మెక్సికోలో ఓ శిశువు ఏఐ సహాయంతో జన్మించింది. ఏఐ అసిస్టెడ్ ఐవీఎఫ్ విధానంలో ప్రపంచంలోనే తొలిసారిగా ఈ శిశువు పురుడు(Baby Delivery) పోసుకుంది. మెక్సికోలోని హోప్ ఐవీఎఫ్(Mexico Hope IVF Center) సెంటర్లో వైద్య నిపుణుల సమక్షంలో ఓ 40 ఏళ్ల మహిళ మగబిడ్డకు జన్మనిచ్చింది. అయితే అండంలోకి వీర్యాన్ని నేరుగా ఇంజెక్ట్ చేసే ఇంట్రాసైటో ప్లాస్మిక్ స్పెర్మ్ ఇంజెక్షన్(ICSI) కు బదులుగా ఆటోమేటెడ్ ఐవీఎఫ్ సిస్టమ్ ను ఉపయోగించారు.
ఈ విధానానికి ఏఐ సహాయం తీసుకున్నట్టు వైద్యబృందం ప్రకటించింది. దీని ద్వారా ఐసీఎస్ఐ ప్రక్రియకు పట్టే 23 దశలేవీ మనిషి సహాయం లేకుండానే పూర్తయ్యాయి. ఈ ప్రక్రియకు కేవలం 9 నిముషాల 56 సెకండ్లు పట్టిందని వారు పేర్కొన్నారు. ఏఐ ద్వారా వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులు రాబోతున్నాయి అనడానికి ఇది నిదర్శనం, ఇదే తొలి అడుగుగా భావిస్తున్నట్టు వైద్యులు వెల్లడించారు.