విధి నిర్వహణలో దురుసుగా ప్రవర్తించిన ఇద్దరు పోలీసుల సస్పెండ్

విధి నిర్వహణలో దురుసుగా ప్రవర్తించిన ఇద్దరు పోలీసులపై సస్పెన్షన్

Update: 2025-03-26 14:53 GMT
విధి నిర్వహణలో దురుసుగా ప్రవర్తించిన ఇద్దరు పోలీసుల సస్పెండ్
  • whatsapp icon

దిశ, కామారెడ్డి : విధి నిర్వహణలో దురుసుగా ప్రవర్తించిన ఇద్దరు పోలీసులపై సస్పెన్షన్ వేటు వేసినట్లు జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర తెలిపారు. బాన్సువాడ పోలీస్ స్టేషన్ కు చెందిన కానిస్టేబుల్ ఎస్.కిరణ్, హోంగార్డు ఎం.గంగాధర్ పై సస్పెన్షన్ వేటు వేసినట్లు చెప్పారు. ఓల్డ్ బాన్సువాడ లోని ఒక కల్లు దుకాణంలో గొల్ల శ్రీనివాస్ అనే వ్యక్తి కల్లు తాగి న్యూసెన్స్ చేస్తున్నాడనే సమాచారం మేరకు బ్లూ కోల్డ్ విధుల్లో ఉన్న వీరిద్దరూ అక్కడికి వెళ్లి మద్యం సేవించి ఉన్న శ్రీనివాస్ పై దురుసుగా ప్రవర్తించారన్నారు. మద్యం సేవించి ఉన్న వ్యక్తితో దురుసుగా ప్రవర్తించినందుకు గాను కానిస్టేబుల్ కిరణ్, హోంగార్డు గంగాధర్ ను తాత్కాలికంగా విధుల నుంచి సస్పెండ్ చేసినట్లు తెలిపారు.

Similar News