' రాజీవ్ యువ వికాసం పథకాన్ని నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోండి..'

రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రాజీవ్ యువ వికాసం పథకం నిరుద్యోగ యువత ఆర్థికంగా స్వయం సమృద్ధి సాధించేందుకు దోహదపడుతుందని ముక్కెర విజయ్ తెలిపారు.

Update: 2025-03-29 13:47 GMT
 రాజీవ్ యువ వికాసం పథకాన్ని నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోండి..
  • whatsapp icon

దిశ, ఆలూర్ : రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రాజీవ్ యువ వికాసం పథకం నిరుద్యోగ యువత ఆర్థికంగా స్వయం సమృద్ధి సాధించేందుకు దోహదపడుతుందని ముక్కెర విజయ్ తెలిపారు. యువత ఈ పథకాన్ని పూర్తిగా వినియోగించుకుని తమ స్వయం సంపాదనను పెంచుకోవాలని సూచించారు. ఈ పథకం ద్వారా అర్హులైన నిరుద్యోగ యువతకు రుణాలు అందించనున్నారు. జూన్ 2, 2025న రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా రుణాలను మంజూరు చేయనున్నారు.

అర్హులైన వారు ఏప్రిల్ 5, 2025 లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. రూ. 50,000 లోపు రుణం 100% మాఫీ రూ.1,00,000 లోపు రుణం 90% మాఫీ రూ 2,00,000 లోపు రుణం - 60% మాఫీ అని అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో వార్షిక ఆదాయం రూ. 1.50 లక్షల లోపు ఉండాలని తెలిపారు. పట్టణ ప్రాంతాల్లో వార్షిక ఆదాయం రూ. 2 లక్షల లోపు ఉండాలన్నారు. వ్యవసాయేతర యూనిట్లకు 21-55 ఏళ్ల లోపు యువత అర్హులని తెలిపారు. వ్యవసాయ రంగానికి 60 ఏళ్లలోపు రైతులు అర్హులన్నారు. కాంగ్రెస్ కార్యకర్తలు ఈ పథకాన్ని ప్రజలకు విస్తృతంగా తెలియజేయాలని ముక్కెర విజయ్ పిలుపునిచ్చారు.

Similar News