42 శాతం కామారెడ్డి బీసీ డిక్లరేషన్ అమలు చెయ్యాలి.. ఎమ్మెల్సీ కవిత

అసెంబ్లీ ఎన్నికల్లో ప్రకటించిన కామారెడ్డి బీసీ డెకరేషన్ అమలు చేయాలని ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు.

Update: 2025-03-29 14:07 GMT
42 శాతం కామారెడ్డి బీసీ డిక్లరేషన్ అమలు చెయ్యాలి.. ఎమ్మెల్సీ కవిత
  • whatsapp icon

దిశ, తాడ్వాయి : అసెంబ్లీ ఎన్నికల్లో ప్రకటించిన కామారెడ్డి బీసీ డెకరేషన్ అమలు చేయాలని ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు. శనివారం ఉదయం రామారెడ్డి మండలంలో కొలువుదీరిన కాలభైరవ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం కామారెడ్డి జిల్లాలోని శుభం కన్వెన్షన్లో ఏర్పాటు చేసిన బీసీ కుల సంఘాల రౌండ్ టేబుల్ సమావేశానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బీసీ వర్గాలకు పెద్దపీట వేసి సముచిత గౌరవాన్ని కల్పించడంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే సాధ్యమైందని ఎమ్మెల్సీ కవిత అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో కుల వృత్తులను బలోపేతం చేస్తుంటే ఎగతాళి చేసిన వారు గడిచిన సంవత్సర కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏ మేరకు నిర్లక్ష్యంగా వాయిస్తుందో నేటికీ చూస్తున్నామని అన్నారు. బీసీ నాయకత్వం బలపడేందుకు బీసీ వర్గాల నుంచి ఐదుగురు రాజ్యసభ సభ్యులను, 8 మంది ఎమ్మెల్సీలను, 58 మంది కార్పొరేషన్ చైర్మన్ లుగా బీసీ నాయకులకు చేసుకోగలిగామని అన్నారు. ఉద్యమాలకు పెట్టింది పేరుగా ఉన్న ఉస్మానియా యూనివర్సిటీ నుంచి తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన అనంతరం రవీందర్ యాదవ్ కు మొట్టమొదటి ఉస్మానియా వైస్ కాన్సర్ గా ఒక బీసీ బిడ్డకు చేసుకున్నామని ఆమె గుర్తు చేశారు.

భారతీయ జనతా పార్టీ ఈ డబ్ల్యూ ఎస్ రిజర్వేషన్ 10 శాతం అని తీసుకువచ్చింది. ఈ రిజర్వేషన్ కొరకు రాజ్యాంగాన్ని సవరించి 50% పైచిలుకు 9 రాష్ట్రాల్లో ఎవరికీ ఇబ్బంది లేకుండా ఈ డబ్ల్యూఎస్ రిజర్వేషన్ అమలు చేస్తుందని గుర్తు చేశారు. అలాంటిది మీరు కామారెడ్డి డెకరేషన్ లో 42 శాతం రిజర్వేషన్ అమలు చేయాల్సిందేనని అన్నారు. కేసీఆర్ ప్రభుత్వంలో సమగ్ర కుటుంబ సర్వే చేసి ప్రభుత్వ వెబ్సైట్లో పెడితే ఆ సర్వే తప్పు లెక్క అంటున్నారు. మరి కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన సర్వేలో బీసీల జనాభా తగ్గిస్తూ ఓసిల జనాభా ఎలా పెరుగుతుందని ఎమ్మెల్సీ కవిత ప్రశ్నించారు. మీరు చేసిన సర్వే నిజమే అయితే కులాల వారిగా లెక్కలు అసెంబ్లీలో ఎందుకు పెడతలేరని అన్నారు. తప్పుడు సర్వే మీ ప్రభుత్వం చేపట్టిందా మా ప్రభుత్వం దా అనేది ప్రజలకు అర్థమైందని తెలంగాణ ప్రజలు సరైన సమయంలో సరైన తీర్పు ఇస్తారని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డి నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్, గొల్ల శీను, సుమిత్రానంద్, సంపత్ గౌడ్, బీసీ కుల సంఘాల నాయకులు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Similar News