మేడారం జాతరకు ప్రత్యేక బస్సులు!

Update: 2022-02-11 13:55 GMT

దిశ, సంగారెడ్డి: మేడారం జాతరకు ఉమ్మడి మెదక్ జిల్లా నుంచి ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశారు. జిల్లాలోని ఎనిమిది డిపోల నుంచి 200 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశారు. వీటితో పాటుగా హుస్నాబాద్ డిపో నుంచి నేరుగా మేడారంకు మరో 40 బస్సులను ఆర్టీసీ నడుపనున్నది. ప్రత్యేక బస్సులు ఈనెల 13వ తేదీ నుంచి 20వ తేదీ వరకు బస్సులను నడుపనున్నట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు.

మెదక్ డిపో నుంచి 15 బస్సులు వరంగల్ వరకు, నారాయణఖేడ్ నుంచి 21 బస్సులు హనుమకొండ వరకు, సంగారెడ్డి నుంచి 44 బస్సులు హనుమకొండ వరకు, జహీరాబాద్ నుంచి 32 బస్సులు హనుమకొండ వరకు, సిద్దిపేట నుంచి 16 బస్సులు వరంగల్ జిల్లాలోని పరకాల వరకు, దుబ్బాక నుంచి 22 బస్సులు వరంగల్ జిల్లా లోని నర్సంపేట వరకు , గజ్వేల్ ప్రజ్ఞాపూర్ నుంచి 35 బస్సులు వరంగల్ జిల్లాలోని తురూర్ వరకు, సిద్దిపేట నుంచి మరో 20 బస్సులు వరంగల్ జిల్లాలోని భూపాలంపల్లి వరకు బస్సులను నడపనున్నారు.

వీటితో పాటుగా హుస్నాబాద్ డిపో నుంచి మరో 40 బస్సులను నేరుగా మేడారం వరకు సర్వీసులు అందించనున్నారు. ఉమ్మడి జిల్లా నుంచి ఈనెల 13వ తేదీన 25 బస్సులు, 14వ తేదీన 135 బస్సులు ,15వ తేదీన 40 బస్సులను నడపనున్నట్లు ప్రకటించారు. జిల్లా నుంచి మేడారానికి వెళ్లే భక్తులు ఆర్టీసీ అందిస్తున్న సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

Tags:    

Similar News