డిప్రెషన్ నుంచి దాని వల్లే బయటపడ్డా.. శివకార్తికేయన్ ఎమోషనల్ కామెంట్స్
కోలీవుడ్ స్టార్ హీరో శివ కార్తికేయన్(Sivakarthikeyan), నేచురల్ బ్యూటీ సాయి పల్లవి(Sai Pallavi) జంటగా నటించిన సినిమా ‘అమరన్’(Amaran).
దిశ, సినిమా: కోలీవుడ్ స్టార్ హీరో శివ కార్తికేయన్(Sivakarthikeyan), నేచురల్ బ్యూటీ సాయి పల్లవి(Sai Pallavi) జంటగా నటించిన సినిమా ‘అమరన్’(Amaran). అక్టోబర్ 31న థియేటర్లలో రిలీజైన ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ టాక్ అనిపించుకుంది. ఇక కలెక్షన్ల విషయానికి వస్తే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పటికీ వసూళ్ల విషయంలో దూసుకుపోతోంది. అయితే తాజాగా గోవా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఖుష్బూ సుందర్‌తో చిట్ చాట్‌లో ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.
ఆయన మాట్లాడుతూ.. ‘నేను ఇంజినీరింగ్ చేస్తున్న టైంలో తొలిసారి స్టేజ్ ఎక్స్పీరియన్స్ చేశా. నా స్నేహితులు నన్ను స్టేజి పైకి తోసేశారు. నీకేది ఇష్టమైతే అది చేయ్.. ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారని’ చెప్పారని శివ కార్తికేయన్ గుర్తు చేసుకున్నాడు. అలాగే మాట్లాడుతూ.. ‘నా కాలేజీ రోజుల్లో నా తండ్రి మరణించాడు. అప్పుడు నేను చాలా డిప్రేషన్కి లోనయ్యా. ఏం చేయాలో నాకు తెలియదు. దాని నుండి బయట పడటానికి చాలా విధాలుగా ట్రై చేశాను. కానీ, ఫలితం లేదు. దీంతో ఎంటర్టైన్మెంట్ను ఓ థెరపీలాగా మార్చుకోవాలని ఫిక్స్ అయ్యా. అలా నన్ను డిప్రెషన్, బాధ వంటి వాటి నుంచి బయటపడేందుకు చప్పట్లు, ప్రశంసలు థెరపీ లాగా పని చేశాయి’ అంటూ చెప్పుకొచ్చాడు శివకార్తికేయన్. ప్రస్తుతం ఈయన చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్‌గా మారాయి.