MLA Koneru Konappa: లవ్ మ్యారేజ్‌కు హాజరైన TRS ఎమ్మెల్యే కోనప్ప
Sirpur MLA Koneru Konappa Attends Love Marriage| పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని సిరిపూర్ఎమ్మెల్యే కోనేరు కోనప్ప అన్నారు. కొమురం భీం అసిఫాబాద్ జిల్లా బెజ్జూర్ మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ కార్యాలయ ఆవరణలో కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేసిన
దిశ, బెజ్జుర్: Sirpur MLA Koneru Konappa Attends Love Marriage| పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని సిరిపూర్ఎమ్మెల్యే కోనేరు కోనప్ప అన్నారు. కొమురం భీం అసిఫాబాద్ జిల్లా బెజ్జూర్ మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ కార్యాలయ ఆవరణలో కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేసిన సందర్భంగా సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప మాట్లాడారు. కళ్యాణ లక్ష్మి పథకం పేదలకు ఒక వరమని తెలిపారు. అన్ని గ్రామాలకు త్వరలో రోడ్డు సౌకర్యం కల్పిస్తామని అన్నారు. విద్యుత్ షాక్‌తో పశువులు మృతిచెందడంతో యజమానులకు రూ.40 వేల చొప్పున చెక్కులను అందజేశారు. బెజ్జూర్ మండలం మర్ధిడి శివారులోని విద్యుత్ లైన్ మంజూరు చేయాలని గ్రామస్తులు కోరగా ఎమ్మెల్యే స్పందించి తన నిధుల నుంచి రూ.2 లక్షలు కేటాయించారు. బెజ్జూర్ రంగనాయక దేవాలయ ప్రాంగణంలో నిరుపేద ప్రేమజంట వివాహ కార్యక్రమంలో పాల్గొని ఆశీర్వదించారు. కొత్త జంటకు రూ.5 వేల ఆర్థిక సహాయం అందజేశారు. అనంతరం బెజ్జూర్ మండలంలోని అంబగట్టు గ్రామానికి చెందిన తలండి లచ్చయ్య కుటుంబాన్ని పరామర్శించారు. కుటుంబాన్ని ఆదుకుంటామని హామీ ఇచ్చారు. అంబగట్టు గ్రామంలోని కల్వర్టు త్వరలో నిర్మిస్తామని తెలిపారు. బెజ్జూరు మండలంలోని నాలుగు రోడ్లు త్వరలోనే పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్వో జమీర్, విద్యుత్ అధికారి బాలకృష్ణ, పీఏసీఎస్ చైర్మన్ ఓం ప్రకాష్, మండల కో-ఆప్షన్ సభ్యులు బశరథకాన్, సర్పంచులు శారద, రవి, శేఖర్, సంతోష్, తిరుపతి, ఎంపీటీసీలు లంగారి శ్రీనివాస్, గురజాల వెంకన్న, టీఆర్ఎస్ మండల అధ్యక్షులు సకరం, యూత్ అధ్యక్షులు నరేంద్ర గౌడ్, నాయకులు వెంకన్న, పుల్లూరు సతీష్, జావిద్ అలీ, జావిద్ హుస్సేన్ రహమత్, వినోద్, రాజారాం, ఇస్తారే, షౌకత్, భీమన్న, అశోక్, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి: తుమ్మల నాగేశ్వరరావు సెన్సేషనల్ కామెంట్స్.. టీఆర్‌ఎస్‌కు గుడ్ బై?