అనారోగ్యంపై క్లారిటీ ఇచ్చిన శ్రుతి హాసన్..
దిశ, సినిమా : సెలబ్రెటీస్‌కు సంబంధించి ఏ చిన్న రూమర్ లీకైనా దానికి విస్తృత ప్రచారం కల్పించడం ఈ రోజుల్లో కామన్ వ్యవహారం..Latest Telugu News
దిశ, సినిమా : సెలబ్రెటీస్‌కు సంబంధించి ఏ చిన్న రూమర్ లీకైనా దానికి విస్తృత ప్రచారం కల్పించడం ఈ రోజుల్లో కామన్ వ్యవహారం. తాజాగా హీరోయిన్ శృతి హాసన్ సైతం ఇలాంటి రూమర్స్ నడుమ నలిగిపోతోంది. ఇటీవల తన అనారోగ్యంగా ఉందంటూ కొన్ని పుకార్లు నెట్టింట షికారు చేయగా.. వాటన్నింటికీ క్లియర్‌గా సమాధానమిచ్చింది శ్రుతి.
'నేను PCOS సమస్యతో బాధపడుతున్నానని చెప్పినంత మాత్రాన అనారోగ్యంతో ఉన్నట్లు కాదు. కొన్ని మీడియా సంస్థలైతే అసలు పోస్ట్ చదవకుండానే వార్తలు ప్రచారం చేస్తున్నట్లు దీన్ని బట్టి అర్థమవుతోంది. మొత్తానికి ఒక్క విషయం మాత్రం గట్టిగా చెప్పాలనుకుంటున్నాను. కొనేళ్లుగా నేను పీసీఓఎస్‌తో బాధపడుతున్నాను. ఈ సంగతి పక్కనబెడితే ప్రస్తుతం నాన్‌స్టాప్‌గా పనిచేస్తూ కెరీర్లో అత్యుత్తమ స్థితిలో ఉన్నాను. అందుకే ఈ విషయంపై కూడా క్లారిటీ ఇస్తున్నా' అని చెప్పుకొచ్చింది.
Actress @shrutihaasan slashes out baseless rumours on her health issues and confirms that she is hale and healthy.
— Vamsi Kaka (@vamsikaka) July 5, 2022
Check out her video statement.#ShrutiHaasan pic.twitter.com/37VrCyY6XH