స్పేస్‌కు నగ్న చిత్రాలు.. ఏలియన్స్ కోసం సైంటిస్టులు
దిశ, ఫీచర్స్ : శాస్త్రవేత్తలు దాదాపు 150 ఏళ్లుగా గ్రహాంతర జీవులతో కనెక్ట్ అయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. వీరి ప్రయత్నాలన్నీ
దిశ, ఫీచర్స్ : శాస్త్రవేత్తలు దాదాపు 150 ఏళ్లుగా గ్రహాంతర జీవులతో కనెక్ట్ అయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. వీరి ప్రయత్నాలన్నీ విఫలమవుతుండగా.. ఇప్పుడు ఏలియన్స్ సీక్రెట్ లైఫ్‌ఫార్మ్‌ను కనిపెట్టేందుకు మరో కొత్త పద్ధతిని ఆశ్రయించనున్నారు. ఇద్దరు వ్యక్తుల నగ్న చిత్రాలను డీప్ స్పేస్‌లోకి పంపడం ద్వారా ఏలియన్స్‌ను ట్రాప్ చేయాలనుకుంటున్నారు. పాలపుంతలో ఉండే ఇంటెలిజెంట్ ఏలియన్స్‌కు చేరుకోగల సందేశాన్ని NASA శాస్త్రవేత్తల బృందం అభివృద్ధి చేసినట్లు సైంటిఫిక్ అమెరికన్ రిపోర్ట్ వెల్లడించింది.
నాసాకు చెందిన సైంటిస్ట్ జొనాథన్ జియాంగ్, అతని సహచరులు జెట్ ప్రొపల్షన్ లేబొరేటరీలో 'బీకాన్ ఇన్ ది గెలాక్సీ(BITG)' పేరుతో కొత్త స్పేస్-బౌండ్ నోట్‌ను రూపొందించారు. దీంతో పాటు భూ వాతావరణం నుంచి ఇద్దరు నగ్న వ్యక్తుల కార్టూన్‌ను పంపడం ద్వారా గ్రహాంతరవాసుల ఉనికిని కనుగొనేందుకు ప్రయత్నిస్తున్నారు. అంతేకాకుండా వారితో కమ్యూనికేషన్‌ను పెంచుకోవాలని శాస్త్రవేత్తల బృందం భావిస్తోంది. ఇందుకు సంబంధించిన ప్రాజెక్ట్‌లో 'హలో' అంటూ చేయి ఊపుతున్న ఒక పురుషుడు, స్త్రీ నగ్న చిత్రాల పిక్సిలేటెడ్ డ్రాయింగ్స్‌తో పాటు గురుత్వాకర్షణ వర్ణణ, DNA వివరాలు కూడా ఉన్నాయి. మానవాళికి పూర్తి భిన్నమైన భాష కలిగిన ఏలియన్స్‌తో కమ్యూనికేట్ చేయడంలో ఎదురవుతున్న సవాళ్ల కారణంగానే వారు ఈ చిత్రాలను ఎంచుకున్నారు.
ఈ ప్రతిపాదిత సందేశంలో అన్ని జాతుల మానవుల కోసం యూనివర్సల్ కమ్యూనికేషన్ ఏర్పాటు చేసేందుకు గణిత, భౌతిక భావనలతో పాటు భూమిపై జీవ రసాయన కూర్పు గురించిన సమాచారం పొందుపరిచారు. అంతేకాదు సౌరవ్యవస్థ, భూమి ఉపరితలానికి సంబంధించి డిజిటలైజ్డ్ వర్ణనలు ఉన్నట్లు ఈ ప్రాజెక్ట్ శాస్త్రవేత్తలు అధ్యయనంలో వెల్లడించారు. బైనరీలో కోడ్ చేయబడిన ఈ యూనివర్సల్ లాంగ్వేజ్ మెసేజ్.. 1, 0ల శ్రేణిని ఉపయోగిస్తుంది.
A Beacon in the Galaxy: Updated Arecibo Message for Potential FAST and SETI Projects https://t.co/W1Lnez0vSS #Astrobiology #SETI #CarlSagan pic.twitter.com/oCBn1xzLB9
— Astrobiology (@astrobiology) March 24, 2022