Salmon fish Health Benefits: సాల్మన్ చేపల స్మెర్మ్ చర్మ ఆరోగ్యానికి చేసే మేలు..?

సముద్ర చేపల్లో ముఖ్యమైన వర్గంలో సాల్మన్ చేప ఒకటి.

Update: 2024-12-18 08:40 GMT

దిశ, వెబ్‌డెస్క్: సముద్ర చేపల్లో ముఖ్యమైన వర్గంలో సాల్మన్ చేప(Salmon fish) ఒకటి. ఈ ఫిష్ తింటే అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా మహిళ ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఈ చేపల్లో విటమిన్లు, ప్రోటీన్లు, ఒమేగా -3 ఫ్యాటీ ఆమ్లాలు(Omega-3 fatty acids) పుష్కలంగా ఉంటాయి. ప్రెగ్రెన్సీ మహిళలు సాల్మన్ ఫిష్ తీసుకుంటే శిశువు మెదడు, నాడీ వ్యవస్థ అభివృద్ధికి ఎంతో తోడ్పడుతాయి.

ప్రధానంగా వీటిలో ఉండే డాక్సా హెక్సా నోయిక్(Doxa Hexa Noic) శిశువు సంపూర్థ ఆరోగ్యానికి మేలు చేస్తుంది. అలాగే కొలెస్ట్రాల్ స్థాయిల్ని అదుపులో ఉంచడమే కాకుండా.. హృదయ సంబంధిత వ్యాధుల్ని దరిచేరనివ్వదు. రక్తంలోని ట్రైగ్లిసరైడ్ లెవల్స్‌ను తగ్గించడంతో ఈ ఫ్యాటీ ఆమ్లాలు సహాయపడుతాయి. రక్తపోటు(blood pressure)ను నియంత్రిస్తాయి. శరీరానికి అవసరమైన కాల్షియంను అందించడంలో, బోన్స్ దృఢత్వాన్ని మెరుగుపర్చడంలో మేలు చేస్తుంది.

హార్మోనల్ అసమతుల్యత(Hormonal imbalance) సమస్యను ఫేస్ చేసే మహిళలు సాల్మన్ ఫిష్ తింటే ఆరోగ్యంపై మంచి ప్రభావం చూపుతుంది. గర్భాశయ సమస్యల(Uterine problems)కు చెక్ పెట్టేందుకు, శరీరంలోని టాక్సిన్లను బయటకు పంపేందుకు వీటిలోని యాంటీఆక్సిడెంట్లు(Antioxidants) మేలు చేస్తాయి. ఈ చేపలో ఉండే ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు.. మహిళల క్లోమం హెల్త్‌‌ను బాగుచేస్తాయి. వీటిలో ఉండే బి 12 విటమిన్ మెదడు ఆరోగ్యానికి కీలకమైనది. నిరాశ, ఆందోళన వంటి మానసిక సమస్యల్ని దూరం చేయడంతో పాటు బరువు సమస్యకు కూడా చెక్ పెట్టొచ్చు.

అలాగే ఈ సాల్మన్ ఫిష్‌ స్మెర్మ్‌తో ఇటీవల పలువురు జనాలు ఫేషియల్ చేయించుకుంటున్నారని వార్తలు వింటూనే ఉన్నాం. ఇందులోని యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు(Anti-inflammatory properties) చర్మ ఆరోగ్యాన్ని రక్షిస్తాయి. అలాగే చర్మంపై మంటను తగ్గించడంలో, గాయాలను తొందరగా మానేందుకు సాల్మన్ ఫిష్ స్మెర్మ్ బాగా ఉపయోగపడుతుందని పలు పరిశోధనల్లో వెల్లడైందని నిపుణులు చెబుతున్నారు. అలాగే ఏజ్‌తో పాటు వచ్చే ముడతల్ని తగ్గించి.. నిత్యం యవ్వనంగా కనిపిస్తారని నిపుణులు సూచిస్తున్నారు.  

Tags:    

Similar News