గంజాయి సాగు చేస్తున్న వ్యక్తి అరెస్ట్​

మండల కేంద్రంలో ఓ వ్యక్తి గంజాయిని సాగు చేస్తుండగా పోలీసులు అరెస్టు చేశారు.

Update: 2024-12-18 12:43 GMT

దిశ, ముత్తారం : మండల కేంద్రంలో ఓ వ్యక్తి గంజాయిని సాగు చేస్తుండగా పోలీసులు అరెస్టు చేశారు. రేపాల గట్టయ్య అనే వ్యక్తి తన ఇంటి ఆవరణలో 12 గంజాయి మొక్కలను సాగు చేస్తుండగా ముత్తారం ఎస్సై నరేష్ అగ్రికల్చర్ ఆఫీసర్ తో కలిసి పట్టుకున్నారు. వీటి విలువ రూ. లక్ష 20 వేలు ఉంటుందని, నిందితుడిపై కేసు నమోదు చేసి బుధవారం మంథని కోర్టులో హాజరు పరిచినట్టు తెలిపారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ ఎవరైనా గంజాయిని అమ్మినా కొన్నా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.


Similar News