Air India: విద్యార్థులకు ఎయిర్ ఇండియా గుడ్ న్యూస్.. టికెట్ బుకింగ్స్ పై 10 శాతం డిస్కౌంట్..!

టాటా గ్రూప్(Tata Group)కు చెందిన ప్రముఖ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా(Air India) కీలక నిర్ణయం తీసుకుంది.

Update: 2024-12-18 12:42 GMT

దిశ, వెబ్‌డెస్క్: టాటా గ్రూప్(Tata Group)కు చెందిన ప్రముఖ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా(Air India) కీలక నిర్ణయం తీసుకుంది. నేషనల్(National), ఇంటర్నేషనల్(International) రూట్లలోని ట్రావెల్ చేసే విద్యార్థులకు(Students) ప్రత్యేకమైన ఆఫర్లను ప్రకటించింది. ఈ ఆఫర్లో భాగంగా బుధవారం నుంచి టికెట్ ఛార్జీలపై 10 శాతం డిస్కౌంట్(Discount)తో పాటు 10 కిలోల వరకు అదనపు లగేజి(Extra Luggage) తీసుకెళ్లడానికి అవకాశమిచ్చింది. ఎయిర్ ఇండియా అధికారిక వెబ్‌సైట్‌(Website), మొబైల్ యాప్(Mobile App) ద్వారా టికెట్ బుకింగ్స్ చేసుకున్న వారికి మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుంది. ఈ విషయాన్ని ఎయిర్ ఇండియా చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ నిపున్ అగర్వాల్(Nipun Aggarwal) ఓ ప్రకటనలో వెల్లడించారు.

అమెరికా(US), కెనడా(Canada), యూకే(UK), ఆస్ట్రేలియా(Australia) తదితర దేశాలకు ట్రావెల్ చేసే విద్యార్థులు మరింత ఈజీగా, తక్కువ ధరలతో ప్రయాణించొచ్చని పేర్కొన్నారు. యూపీఐ(UPI), నెట్ బ్యాంకింగ్(Net Banking) సంస్థ జారీ చేసిన క్రెడిట్(Credit)/ డెబిట్ కార్డుల(Debit Cards) ద్వారా టికెట్ బుక్ చేసుకుంటే 25 శాతం వరకు తగ్గింపు పొందచ్చని అన్నారు. అయితే ఈ ఆఫర్ పొందాలంటే దేశీయంగా ట్రావెల్ చేసే విద్యార్థులకు కనీసం 12 సంవత్సరాలు ఉండాలని, ఇక ఇంటర్నేషనల్ జర్నీ చేసే వారికి 12 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలని తెలిపారు. అలాగే విద్యార్థులు తమ స్కూల్/ యూనివర్సిటీ సంబంధించి ఐడీ కార్డు(ID Card) కలిగి ఉండాలని వెల్లడించారు.

Tags:    

Similar News